Amarraja
-
ఏపీ పెట్టుబడులపై ఈనాడు,జ్యోతి కాకమ్మ కథలు...వాస్తవాలు ఇవి!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధిలో దేశంలోనే అగ్రగామిగానిలుస్తోంది. ఇప్పటికే సంక్షేమంలో తిరుగులేని రికార్డు నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. ఇది స్వయంగా కేంద్రం ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తేల్చిన లెక్కలు. అందుకే దుష్టమీడియాకు కంటగింపుగా మారింది. అబద్దాలు, అవాస్తవాలతో మసిపూసి మారేడు కాయ జేయాలని చూస్తున్నాయి. భారీ పెట్టుబడులతో, అభివృద్ధికి బాటలు వేస్తూ తన సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పిన తీరు ఆదర్శనీయంగా నిలుస్తోంది. ఇది చూసి ఓర్వలేని ఈనాడు, జ్యోతి కాకమ్మ కథలు...కల్లబొల్లి కథనాలు చెల్లవుగాక చెల్లవు. వాస్తవాలు ♦ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మరి కేంద్రానికి డీపీఐఐటీ ఇచ్చిన ర్యాంకులు ఇవి. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ♦ 2017- 18 నుంచి 2019-20 వరకు 5 శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021-22లో 13 శాతం(12.78 శాతం) నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే ...కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి ♦ 2019-20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020-21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం. ♦ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసింది. ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చాయి. పనిగట్టుకుని బురద జల్లే కబోది మీడియాకు ఇలాంటి వాస్తవాలు కనిపించవు. ♦ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చౌదరికి చెందిన అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. దీన్ని వక్రీకరించి రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లి పోతోందంటూ గుండెలు బాదుకోవడం మీకే( ఈనాడు, జ్యోతి) చెల్లింది. -
'అమర్‌రాజాను ప్రత్యేకంగా టార్గెట్ చేశామన్నది అవాస్తవం'
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపట్టామని పర్యావరణ శాఖ అధికారి, ఎక్స్ ఆఫీసీయో కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా అమర్‌రాజాను టార్గెట్ చేశామన్నది అవాస్తవమని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమర్‌రాజాకు నోటీసులు ఇచ్చి 2 నెలల సమయం ఇచ్చాం. ఆ తర్వాత మళ్లీ తనిఖీ చేసి కాలుష్యాన్ని నియంత్రించాలని చెప్పాం. పర్యావరణ చర్యలు చేపట్టకముందే రెండోసారి నోటీసులు ఇచ్చాం. హానికరమైన అంశాలు గుర్తించి అమర్‌రాజాకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం. పరిశ్రమల ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా పీసీబీ నియంత్రిస్తుంది. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ కేటగిరీ పరిశ్రమల్లో ప్రతి నెలా తనిఖీలు చేస్తాం. జనవరిలో 54 పరిశ్రమలు తనిఖీ చేశాం. కొన్ని పరిశ్రమల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించాం.అందులో భాగంగానే అమర్‌రాజాతో పాటు చాలా ఫ్యాక్టరీల్లో తనిఖీలు చేపట్టి 54 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. 64 పరిశ్రమలకు ఉత్పత్తి ఆపాలని ఆదేశాలు ఇచ్చాం. 50 పరిశ్రమలకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చాం అని తెలిపారు. -
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్‌గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్‌బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి
సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని భూములిస్తే పదేళ్లయినా పట్టించుకోనందుకే అమరరాజా ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చిన 253 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి గురువారం పేర్కొన్నారు. అమరరాజా భూములను వెనక్కు తీసుకోవడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ఎలా అంటారని ప్రశ్నించారు. (అమరరాజా ఇన్ఫ్రా టెక్ నుంచి 253.61 ఎకరాలు వెనక్కి) ‘253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని సర్కారు వెనక్కు తీసుకుంది. పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపట’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. (బెజవాడలో లాక్డౌన్ ప్రభావం..) నాన్న ఒక్క అడుగు.. తనయుడు రెండడుగులు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించి ఒక్క అడుగు ముందుకేస్తే, వాటికి అత్యాధునిక సౌకర్యాలు చేర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ‘నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108, 104 వాహనాలను ప్రారంభించిన మన యువ ముఖ్యమంత్రి జగన్’ అని పేర్కొన్నారు. -
‘అమరరాజా’కు షాక్; 253.61 ఎకరాలు వెనక్కి
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్ఫ్రా టెక్కు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరరాజ్ ఇన్ఫ్రా టెక్కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్ కేటాయించింది. ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్ఫ్రా టెక్ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. (రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి) -
అమర్‌రాజాకూ చుక్కెదురు
హైదరాబాద్: అమర్‌రాజా బ్యాటరీస్‌కు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ లెసైన్సు ఇచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరాకరించింది. చిత్తూరు జిల్లాలో కంపెనీకి చెందిన ప్లాంటు వరకు సొంతంగా (ప్రైవేటుగా) విద్యుత్ పంపిణీ చేసుకుంటామని... ఇందుకోసం లెసైన్సు ఇవ్వాలని కంపెనీ కోరింది. అయితే ఇలాంటి లెసైన్సును జారీ చేయడం వల్ల గుత్తాధిపత్యం ఏర్పడుతుందని ఈఆర్సీ అభిప్రాయపడింది. ఈ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌ను ఎస్పీడీసీఎల్ నుంచే కొనుగోలు చేస్తామన్న అమర్‌రాజా వాదనను ప్రస్తావిస్తూ.. ఎలాగూ ఎస్పీడీసీఎల్ నుంచే ప్రస్తుతం కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నందున ప్రత్యేకంగా లెసైన్సు అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. అమర్‌రాజా దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జీఎంఆర్ సంస్థ చేసుకున్న దరఖాస్తును కూడా ఈఆర్సీ ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.