
సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని భూములిస్తే పదేళ్లయినా పట్టించుకోనందుకే అమరరాజా ఇన్‌ఫ్రా కంపెనీకి ఇచ్చిన 253 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి గురువారం పేర్కొన్నారు. అమరరాజా భూములను వెనక్కు తీసుకోవడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ఎలా అంటారని ప్రశ్నించారు. (అమరరాజా ఇన్‌ఫ్రా టెక్ నుంచి 253.61 ఎకరాలు వెనక్కి)
‘253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్‌ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని సర్కారు వెనక్కు తీసుకుంది. పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపట’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. (బెజవాడలో లాక్‌డౌన్ ప్రభావం..)
నాన్న ఒక్క అడుగు.. తనయుడు రెండడుగులు..
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించి ఒక్క అడుగు ముందుకేస్తే, వాటికి అత్యాధునిక సౌకర్యాలు చేర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారని విజయసాయి రెడ్డి కొనియాడారు.
ఈ మేరకు చేసిన ట్వీట్లో ‘నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108, 104 వాహనాలను ప్రారంభించిన మన యువ ముఖ్యమంత్రి జగన్’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment