amararaja Factory
-
‘అమరరాజా’ వెళ్లిపోతే విపత్తే: కేటీఆర్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్‌రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని సూచించారు.గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని అమర్‌రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయదేవ్ అన్నట్లు వచ్చిన వార్తలపై ఆదివారం(ఆగస్టు11) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను.నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’అని కేటీఆర్ హెచ్చరించారు. -
బాగోతం బట్టబయలు.. అమరరాజా ఆటకట్టు..
వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒక్కటే అన్నట్లుగా సాగింది గతంలో అమరరాజా వ్యవహారం. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆడిందే ఆట, పాడిందే పాటగా అటవీ శాఖ భూముల్లో పాగావేసింది. అనుమతి తీసుకున్న భూమిని కాదని.. పక్కనున్న స్థలాన్నీ కలిపేసుకుంది. ఎంచక్కా గోడ కట్టేసినా.. పెద్దలతో వ్యవహారంతో కావడంతో అధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఈ బాగోతం కాస్తా బట్టబయలు కావడంతో అధికారుల్లోనూ చలనం వచ్చింది. చర్యలకు సిద్ధమైన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు అనధికార ప్రహరీని కూల్చేసి.. ఆక్రమిత స్థలాన్ని స్వాదీనం చేసుకోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలోని కరకంబాడి పంచాయతీ పరిధిలో ‘అమరరాజా’ యాజమాన్యం 2000 సంవత్సరంలో తమ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సమీప అటవీ శాఖ(ఫారెస్ట్ పోరంబోకు) భూమిని భూ మార్పిడి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఆ మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో 4.4 హెక్టార్ల అటవీభూమిని కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమరరాజాకు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం 4.4 హెక్టార్లకు అనుమతిస్తే.. ఫ్యాక్టరీ యాజమాన్యం మరో 3.04 హెక్టార్లను ఆక్రమించేసింది. ఏకంగా ఆ అటవీ భూముల్లోనే ప్రహరీ కట్టేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 766 సర్వే నంబర్ పరిధిలోకి వచ్చే దాదాపు ఏడున్నర ఎకరాలకు పైగా భూమిని అడ్డగోలుగా ఆక్రమించేసింది. ఇలా సుమారు రెండు దశాబ్దాలుగా అటవీభూమిని ఆక్రమించుకున్నా ఎవ్వరూ సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం జోలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. అమరరాజా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విష కాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇచ్చిన పరిణామాలతో అమరరాజా వివాదాల తుట్టె ఈ మధ్యకాలంలో కదలడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జూలై 20న ‘సాక్షి’లో ‘అటవీభూముల్లో అమరరాజా’ శీర్షికన వచ్చిన కథనంపై అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. తొలుత ఆయా భూముల్లో ఆక్రమిత గోడను తొలగించాలని యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున సిబ్బందితో వెళ్లి అక్రమిత భూమిలోని ప్రహరీని కూల్చేశారు. అమరరాజా కలిపేసుకున్న ఆ మూడు హెక్టార్ల భూమిని తిరిగి స్వాదీనం చేసుకున్నామని తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్‌వో) పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఆ 18 ఎకరాలూ అటవీభూములే.. అమరరాజా భూ ఆక్రమణలకు సంబంధించి తాజాగా అటవీశాఖ అధికారులు మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌కు చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ పరిధిలో 18 ఎకరాల అటవీ భూములు ఉన్నాయని చెబుతున్నారు. నోటిఫైడ్ గెజిట్ ప్రకారం అవి కచ్చితంగా అటవీ శాఖ భూములేనని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో 2015–16 మధ్య కాలంలో కరకంబాడి పంచాయతీ పరిధిలోనే 21 ఎకరాల భూములను అమరరాజా యాజమాన్యం కొనుగోలు చేసింది. 1982లో పేదల కోసం అసైన్ చేసిన ఆ భూములను అడిగిందే తడవుగా ఆరేళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం అలినేషన్ పేరిట అమరరాజాకు విక్రయించింది. అయితే ఈ 21 ఎకరాల భూముల్లో 18 ఎకరాలు అటవీ భూములేనని, 1979లో నోటిఫై చేసిన అటవీ భూములను రెవెన్యూ అధికారులు ఎలా విక్రయిస్తారని అటవీశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ మేరకు భూముల పూర్తి వివరాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఇటీవల లేఖ రాశారు. వాస్తవానికి గతంలో అవి అటవీ భూములేనని, అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ నేపథ్యంలో డీనోటిఫైగా చూపిస్తున్నాయనేది రెవెన్యూ అధికారుల వాదన. అయితే ఆ భూమి ఎప్పుడు, ఎందుకు డీనోటిఫై చేశారో వివరాలు అందుబాటులో లేవని చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఆ సర్వేతోనైనా 18 ఎకరాల అటవీ భూముల అసలు ‘కథ’ బయటికొస్తుందో లేదో చూడాలి. -
‘అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉంటే.. 25 ఏళ్ల జైలు శిక్ష పడేది’
అనంతపురం: అమర్‌రాజ ఫ్యాక్టరీపై ఎల్లోమీడియా వక్రభాష్యం చెబుతోంది అంటూ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉండి ఉంటే వారు చేసిన కాలుష్యానికి.. 25 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు వేసేవారు అని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబే అని మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు విజయవాడ: పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు.. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం, బీజేపీకి క్యాడర్ లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పులిచింతల ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపైనా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారని మల్లాది విష్ణు తెలిపారు. -
అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య
-
‘అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య’
సాక్షి, చిత్తూరు: అమర రాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అమరరాజాతో పాటు 54 ఫ్యాక్టరీలకు నోటీసులు ఇచ్చారన్నారు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై చంద్రబాబు గగ్గోలు పెట్టారని.. ప్రాణాలతో ఆడుకుంటున్న అమర్‌రాజా ఫ్యాక్టరీపై ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. -
అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు
-
పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకోకండి
సాక్షి, అమరావతి: కంపెనీ పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని భూములిస్తే పదేళ్లయినా పట్టించుకోనందుకే అమరరాజా ఇన్ఫ్రా కంపెనీకి ఇచ్చిన 253 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి గురువారం పేర్కొన్నారు. అమరరాజా భూములను వెనక్కు తీసుకోవడం అన్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ఎలా అంటారని ప్రశ్నించారు. (అమరరాజా ఇన్ఫ్రా టెక్ నుంచి 253.61 ఎకరాలు వెనక్కి) ‘253 ఎకరాల భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని సర్కారు వెనక్కు తీసుకుంది. పెద్ద, చిట్టి నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే కక్ష సాధింపట’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. (బెజవాడలో లాక్డౌన్ ప్రభావం..) నాన్న ఒక్క అడుగు.. తనయుడు రెండడుగులు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించి ఒక్క అడుగు ముందుకేస్తే, వాటికి అత్యాధునిక సౌకర్యాలు చేర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేశారని విజయసాయి రెడ్డి కొనియాడారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో ‘నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108, 104 వాహనాలను ప్రారంభించిన మన యువ ముఖ్యమంత్రి జగన్’ అని పేర్కొన్నారు. -
ఆగని గల్లా గూండాల ఆగడాలు
నలుగురి కిడ్నాప్ చోద్యం చూస్తున్న అధికారులు చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి దౌర్జన్యాలు మితి మీరుతున్నాయి. శెట్టిపల్లిలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై స్వైరవిహారం చేసి గాయపరిచిన సంఘటన మరవకముందే మళ్లీ గల్లా గూం డాలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. చంద్రగిరి మండలం పనబాకం పంచాయతీ ఇరుగురంగయ్యగారిపల్లెలో వైఎస్ఆర్ సీపీ నాయకులపై సోమవారం సాయంత్రం దాడులు చేశారు. కర్రలు, ఇనుపరాడ్లతో ఆటోను ధ్వంసం చేశారు. అందులో వెళుతున్న ఇద్దరిని చితకబాదారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సాయంత్రం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరుగురు గ్రామశివార్లలో మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఓ సుమోలో వచ్చిన గ్రామానికి చెందిన గల్లా అనుచరులు మురళి, ప్రేమ్‌కుమార్‌తోపాటు మరికొందరు ఆ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. మిగిలిన నలుగురిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాయపరిచి వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పక్కకు తీసుకెళ్లిన ఆ ఇద్దరు లోకేష్, చంద్రబాబులను కర్రలతో చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అక్కడే వదలి పరుగెత్తుకుంటూ అమరరాజా స్టిక్కర్ ఉన్న సుమోలో పారిపోయారు. బాధితులు ఆటోలో రుయాకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఆ నలుగురిని ఏంచేశారు? బాధితుల వివరాల మేరకు ఐ.రంగయ్యగారిపల్లికి చెందిన గల్లా అనుచరులు, వైఎస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ఉమాపతి, వెంకటేశ్, మునికృష్ణ, భానును టాటా సుమో లో కిడ్నాప్ చేశారు. వారిని అమరరాజ ఫ్యాక్టరీకే తరలించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకులను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీలో పనిచేస్తున్నారనే కారణంతో యువకులను కిడ్నాప్ చేసి, బంధించారని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. పాకాలలో ప్రచార రథంపై దాడి పాకాల మండలం కంబాలమిట్టలో ప్రచారం చేస్తున్న ప్రచార రథంపై గల్లా అనుచరులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ ఆమె అనుచరులు ప్రచార రథం డ్రైవర్ భవన్‌ను చితకబాదారు. అనుమతులు ఉన్న ప్రచార రథంలో పాటలు వేయవద్దంటూ, రథానికి ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దీనిపై పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టించుకోని అధికారులు మూడు రోజలుగా గల్లా అనుచరులు, అమరరాజ ఫ్యాక్టరీ సిబ్బంది వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రచార రథాలు, కళాకారులపై దాడులు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలకు వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులపై గల్లా అరుణకుమారి తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు. అమరరాజ కంపెనీకి చెందిన వాహనాల్లో వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీటిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు.