సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్‌రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని సూచించారు.
గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని అమర్‌రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయదేవ్ అన్నట్లు వచ్చిన వార్తలపై ఆదివారం(ఆగస్టు11) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను.
నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’అని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment