సాక్షి, అమరావతి: పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధిలో దేశంలోనే అగ్రగామిగానిలుస్తోంది. ఇప్పటికే సంక్షేమంలో తిరుగులేని రికార్డు నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. ఇది స్వయంగా కేంద్రం ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తేల్చిన లెక్కలు.
అందుకే దుష్టమీడియాకు కంటగింపుగా మారింది. అబద్దాలు, అవాస్తవాలతో మసిపూసి మారేడు కాయ జేయాలని చూస్తున్నాయి. భారీ పెట్టుబడులతో, అభివృద్ధికి బాటలు వేస్తూ తన సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పిన తీరు ఆదర్శనీయంగా నిలుస్తోంది. ఇది చూసి ఓర్వలేని ఈనాడు, జ్యోతి కాకమ్మ కథలు...కల్లబొల్లి కథనాలు చెల్లవుగాక చెల్లవు.
వాస్తవాలు
♦ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మరి కేంద్రానికి డీపీఐఐటీ ఇచ్చిన ర్యాంకులు ఇవి. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది?
♦ 2017- 18 నుంచి 2019-20 వరకు 5 శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021-22లో 13 శాతం(12.78 శాతం) నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా?
♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే ...కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి
♦ 2019-20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020-21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం.
♦ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసింది.
♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చాయి. పనిగట్టుకుని బురద జల్లే కబోది మీడియాకు ఇలాంటి వాస్తవాలు కనిపించవు.
♦ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చౌదరికి చెందిన అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. దీన్ని వక్రీకరించి రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లి పోతోందంటూ గుండెలు బాదుకోవడం మీకే( ఈనాడు, జ్యోతి) చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment