చంద్రబాబు సంపద సృష్టిస్తానంటూ పెద్ద బిల్డప్ ఇస్తారు. 2014–19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా (జీఎస్‌డీసీ) కేవలం 4.47 శాతం మాత్రమే. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ 4.83 శాతానికి పెరిగింది. తయారీ రంగంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా కేవలం 2.86 శాతం మాత్రమే. అదే రెండేళ్లు కోవిడ్ కష్టకాలంలో పాలన సాగించిన వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య 4.07 శాతానికి పెరిగింది.
అంటే చంద్రబాబు హయాంలో వెనకబడినట్లు కాదా?
» వైఎస్సార్‌సీపీ హయాంలోనే పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు తానేదో తీసుకొస్తున్నట్టు చంద్రబాబు, లోకేశ్ కలరింగ్ ఇస్తున్నారు. గతంలో దావోస్ వేదికగా మిట్టల్‌తో సంప్రదింపులు చేశాం. మా హయాంలో అదాని ఫౌండేషన్ విశాఖలో డేటా సెంటర్ పెట్ట లేదా? కుమార మంగళం బిర్లా ఫ్యాక్టరీ ప్రారంభించారు.
» విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముకేష్ అంబానీ ప్రత్యేకంగా వచ్చారు. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని స్టేట్‌మెంచ్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 8 బయో ఇథనాల్ ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు సమక్షంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి రూ.65 వేల కోట్లతో రిలయన్స్ పెట్టుబడులు అంటూ బిల్డప్ ఇస్తున్నారు.
» చంద్రబాబు కొడుకు లోకేశ్ అయితే.. ఏపీలో రూ.1.61 లక్షల కోట్లత్లో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తోంది.. ఆదిత్య మిట్టల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేసి ఒప్పించినట్టు కలరింగ్ ఇచ్చారు. మిట్టల్ ఇప్పటికే ఒడిశాలో రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడుతున్నారు.
లోకేశ్ స్టేట్‌మెంట్‌తో ఒడిశా బీజేపీ మంత్రి రివర్స్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒడిశాలో మిట్టల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది.. ఇది ఎక్కడికీ వెళ్లట్లేదని గట్టిగా చెప్పారు. ఎవరైనా ఎన్ని చోట్ల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలుగుతారు? చంద్రబాబు, లోకేశ్ ఎవరి చేవిలో పూలు పెట్టేందుకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ డ్రామాలు చేస్తున్నారు?
» మరో వైపు పరిశ్రమలను పెడతామంటున్న సజ్జన్ జిందాల్ వంటి పారిశ్రామిక వేత్తలను వెళ్లగొడుతున్నారు. జిందాల్ కడపలో 5 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడతామంటే నేరాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్న జత్వానితో కేసులు పెట్టించి బెదరగొడుతున్నారు. వీళ్ల హయాంలో రాని దానికి ఒక బిల్డప్.. వచ్చే వాళ్లపై దొంగ కేసులు పెట్టి తరిమేస్తున్నారు. ఇదేనా మీ పారిశ్రామిక విధానం?
Comments
Please login to add a commentAdd a comment