ease of doing business rankings
-
ఏపీ పెట్టుబడులపై ఈనాడు,జ్యోతి కాకమ్మ కథలు...వాస్తవాలు ఇవి!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వృద్ధిలో దేశంలోనే అగ్రగామిగానిలుస్తోంది. ఇప్పటికే సంక్షేమంలో తిరుగులేని రికార్డు నెలకొల్పిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. ఇది స్వయంగా కేంద్రం ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తేల్చిన లెక్కలు. అందుకే దుష్టమీడియాకు కంటగింపుగా మారింది. అబద్దాలు, అవాస్తవాలతో మసిపూసి మారేడు కాయ జేయాలని చూస్తున్నాయి. భారీ పెట్టుబడులతో, అభివృద్ధికి బాటలు వేస్తూ తన సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పిన తీరు ఆదర్శనీయంగా నిలుస్తోంది. ఇది చూసి ఓర్వలేని ఈనాడు, జ్యోతి కాకమ్మ కథలు...కల్లబొల్లి కథనాలు చెల్లవుగాక చెల్లవు. వాస్తవాలు ♦ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ (EODB) లో గత మూడేళ్లుగా ఏపీ మొదటి ర్యాంక్ లో ఉంది. పారిశ్రామిక వేత్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని మరి కేంద్రానికి డీపీఐఐటీ ఇచ్చిన ర్యాంకులు ఇవి. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ♦ 2017- 18 నుంచి 2019-20 వరకు 5 శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021-22లో 13 శాతం(12.78 శాతం) నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? ♦ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే ...కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి ♦ 2019-20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020-21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం. ♦ 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసింది. ♦ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చాయి. పనిగట్టుకుని బురద జల్లే కబోది మీడియాకు ఇలాంటి వాస్తవాలు కనిపించవు. ♦ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చౌదరికి చెందిన అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోంది. దీన్ని వక్రీకరించి రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లి పోతోందంటూ గుండెలు బాదుకోవడం మీకే( ఈనాడు, జ్యోతి) చెల్లింది. -
పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏపీలో ఉంది: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అనువైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 300 అంశాలను పరిశీలించి కేంద్రం ర్యాంకింగ్స్ ఇచ్చింది, అంతే కాక పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమైందని, 4 లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన ఘనత వారిదని ధ్వజమెత్తారు. చదవండి: షాకింగ్ వీడియో: తెనాలిలో కారు బీభత్సం -
మరోసారి సత్తా చాటిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం సత్తా చాటింది. మరోసారి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలవడం పట్ల సంతోషంగా ఉందని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'దేశంలోనే ఏపీ మొదటి స్థానం సంపాదించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతే. పరిశ్రమలకు సీఎం జగన్ చక్కని ప్రోత్సాహం ఇస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అనుకూలం. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. సీఎం జగన్ రెండురోజుల క్రితం ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్ ఇబ్బందులు పరిశ్రమలకు కలగకుండా సీఎం ఆదేశాలతో అధికారులు సహకరించారు. టాప్ అచీవర్స్‌గా ఏపీ దేశంలోనే మొదటి స్థానం సంపాదించడం గర్వంగా ఉంది' అని మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు. చదవండి: (బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020: ఏపీకి టాప్ ప్లేస్) -
చైనాకు ఊడిగం.. ఆమెకు పదవీగండం
డబ్ల్యూటీవో రూల్స్‌ను విస్మరించి.. ప్రపంచ మార్కెట్‌ను శాసించాలనే చైనా అత్యాశ వాళ్ల పీకకే చుట్టుకుంది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో పైరవీల ద్వారా మెరుగైన ర్యాంక్ సంపాందించిన వ్యవహారం బట్టబయలు కావడంతో చైనా నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా(68)కు పదవీగండం పట్టుకుంది. గతంలో చైనాకు ఊడిగం చేశారన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో ఆమె పాత్ర దాదాపు ఖరారైనట్లే!. దీంతో ఆమెను కొనసాగించడమా? తీసేయడమా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డు చేతుల్లో ఉంది. చైనాకు మెరుగైన ర్యాంకింగ్ లభించేలా వరల్డ్ బ్యాంక్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని, డేటాను మార్చేశారని క్రిస్టలీనా (ఆ టైంలో ఆమె సీఈవోగా ఉన్నారు) ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పటి వరల్డ్ బ్యాంక్ మాజీ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్ హస్తం ఉందని తేలింది. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్‌లో చైనా పైరవీల వ్యవహారం ఆరోపణలపై వరల్డ్ బ్యాంక్ ఎథిక్స్ కమిటీ దర్యాప్తు చేసింది. మరోవైపు విల్‌మెర్‌హేల్ లీగల్ సంస్థ దర్యాప్తులోనూ ఆమెపై ఆరోపణలు నిజమని నిరూపితంకాగా, గురువారం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ ఐఎంఎఫ్ బోర్డ్ మెంబర్స్‌కు లేఖ రాసింది క్రిస్టలీనా. పైగా ఫ్రాన్స్, యూరోపియన్ దేశాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. ఈ తరుణంలో తొందరపాటు నిర్ణయంగా కాకుండా.. ఆమెను పదవిలో కొనసాగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునేందుకు సోమవారం నుంచి వరుస భేటీలు కానున్నాయి వరల్డ్‌బ్యాంక్, ఐఎంఎఫ్ బోర్డులు. డూయింగ్ బిజినెస్ ర్యాకింగ్స్లో.. చైనా 2018 ఏడాదికి(హాంకాంగ్‌తో కలిసి ఐదవ స్థానం-వ్యక్తిగతంగా 78వ స్థానం, 2020లో హాంకాంగ్‌తో కలిసి మూడవ స్థానం-వ్యక్తిగతంగా 31వ స్థానానికి ఎగబాకింది. అయితే 2018, 2020తో పాటు మధ్యలో 2019లోనూ చైనా ఫేక్ ర్యాంకులు దక్కించుకుందనేది ప్రపంచ బ్యాంక్ అంతర్గత దర్యాప్తు సంస్థ వెల్లడించిన అంశం. చదవండి: చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు.. పాక్ పాత్ర కూడా! -
నారాయణ స్కూల్ ర్యాంకుల్లా లోకేష్ ప్రచారం
సాక్షి, అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెట్‌లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం సాధించడంపై ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి తప్పుబట్టారు. గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తననానికి నిదర్శమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్లు దిగజారి ఉన్నాయని, 10వ తరగతి ఫలితాల రోజు నారాయణ స్కూల్ ర్యాంకులు ప్రచార చేసినట్టు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలిన హితవుపలికారు. అబద్ధాలతో లోకేష్ భవిష్యత్కే నష్టమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎంఎస్ఈలకు ఉపయోగపడుతుందని, 2019 ఆగస్ట్‌లో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల డేటా పంపినట్లు వివరించారు. (సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్ వన్) సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. ‘గతంలో ర్యాంక్‌కు, ఇప్పుడొచ్చిన ర్యాంక్‌కు చాలా తేడా ఉంది. మొట్టమొదటి సారి సర్వే చేసి ఫలితాలు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారితోనే సర్వే చేశారు. అది కూడా కేవలం 10శాతం మాత్రమే సర్వే చేశారు. 32లక్షల కోట్ల ఎంవోయూలు అన్నారు. 50వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ప్రభుత్వం 20 ఏళ్లూ పెనాల్టీ కట్టే రీతిలో రాయితీలు పెట్టారు. మా వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?. సీఎం జగన్ పారదర్శక పాలన వల్ల ఇది సాధ్యమైంది. సీఎం జగన్ విధానాలపై పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నారు’ గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. (జగన్ పాలనపై 100% సంతృప్తి) -
‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అభినందనలు ’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకమని శనివారం ట్వీట్ చేశారు. (చదవండి : ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్) కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో ఏపీ బర్వన్ స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఓవరాల్ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. -
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్
-
సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్ వన్
సాక్షి, అమరావతి/ ఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఓవరాల్ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వ పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ రేటింగ్ అద్దం పడుతోంది. ఇక ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఈ మేరకు 2020 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. పెరిగిన పారదర్శకత, మెరుగైన పనితీరుకు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లు అద్దం పట్టాయని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. తొలిమూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. గత సర్వే ల కంటే భిన్నంగా ఈ సారి సర్వే నిర్వహించారు. తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా.. ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలుఅభి ప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో మొదటిస్థానంలో నిలిచింది. -
వ్యాపారానికి భారత్ భేష్..
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్‌కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు. స్పైస్ సూపర్..: భారత్‌లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. జీఎస్టీ సరళీకరణతో మరింత మెరుగు.. వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
టాప్ 50లోకి భారత్
గాంధీనగర్: వచ్చే ఏడాది నాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన దేశం 50వ ర్యాంకుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ తొమ్మిదో సదస్సులో శుక్రవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ బ్యాంకు..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన దేశం 75 ర్యాంకులను అధిగమించిందని తెలిపారు. ‘వచ్చే ఏడాదికల్లా 50వ ర్యాంకుకు చేరుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడాల్సిందిగా నా బృందానికి సూచించా. వ్యాపారానికి సంబంధించి నిబంధనలతోపాటు ప్రక్రియ కూడా మరింత సరళంగా ఉండాలని, తక్కువ వ్యయంతో పూర్తయ్యేలా ఉండాలనేదే నా అభిమతం’ అని అన్నారు. శక్తిసామర్థ్యాలమేరకు భారత్ ఎదిగేందుకు ఏవి ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని తొలగించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సంస్కరణలతో ముందుకు... సంస్కరణలు, సడలింపులతో ముందుకు సాగుతామన్నారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం, పన్నులను ఏకీకృతం చేయడం,లావాదేవీలను సరళతరం చేయడం వంటి చర్యలతో ప్రక్రియ మరింత సమర్థమంతమైందన్నారు. డిజిటలీకరణ, ఆన్లైన్ లావాదేవీలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరింత వేగవంతమైందన్నారు. ఐటీ కొనుగోళ్లలో ఆధారిత లావాదేవీలు, డిజిటల్ చెల్లి ంపులు కూడా ప్రపంచ దేశాల్లో మన ర్యాంకు పెరిగేందుకు దోహదపడిందని ఆయన వివరించారు. -
తెలుగు రాష్ట్రాలకు తొలి రెండు ర్యాంకులు..
సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల రాష్ట్రాల సరళతర వాణిజ్య (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సూచీలో ఏపీ, తెలంగాణా తొలి రెండు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ సూచీలో హర్యానా మూడవ స్ధానంలో నిలిచిందని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2017 వెల్లడించింది. గత ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర స్ధానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి రెండో స్దానంలో నిలిచింది. సంస్కరణల ఆధారిత స్కోర్, ఫీడ్‌బ్యాక్ స్కోర్‌ను క్రోడీకరించిన అనంతరం తుది ర్యాంకులను ప్రకటించారు. కాగా జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు సంస్కరణల ఆధారిత స్కోర్‌ను 100 శాతం సాధించడం గమనార్హం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జార్ఖండ్ నాలుగో ర్యాంక్‌లో, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి. పలు స్టీల్ ప్లాంట్లు, బొగ్గు, ముడి ఇనుము గనులను కలిగిన జార్ఖండ్ సంస్కరణల ఆధారిత స్కోర్‌ను నూరు శాతం సాధించిందని డీఐపీపీ తెలిపింది. సంస్కరణల ఆధారిత స్కోర్ తక్కువగా నమోదు చేయడంతో మహారాష్ట్ర 13వ ర్యాంక్, తమిళనాడు 15వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ పేలవమైన సామర్థ్యం కనబరిచి ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో 23వ స్ధానం సాధించింది. మరోవైపు వ్యాపారం నిర్వహించేందుకు అనుకూల దేశాల వార్షిక జాబితా 2017ను వరల్డ్ బ్యాంక్ ప్రకటించే ముందు రాష్ట్రాల తాజా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. గత ఏడాది భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తన స్ధానాన్ని మెరుగుపరుచుకుని 100వ ర్యాంక్‌కు ఎగబాకింది. అంతకుముందు ఏడాది భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో అట్టడుగున 130వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. -
యూపీఏ హయాంలోనే అది సాధించాల్సింది
-
యూపీఏ హయాంలోనే అది సాధించాల్సింది
సాక్షి, న్యూఢిల్లీ : తమ పాలనలో అభివృద్ధి చేయలేని కొందరు.. ఇప్పుడు చేస్తున్న తాము చేస్తున్న అభివృద్ధిపై విమర్శలు చేస్తున్నారంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రవాసీ భారతీయ కేంద్రంలో శనివారం జరిగిన భారత వ్యాపార సంస్కరణల సదస్సులో మోదీ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ‘‘ఆనాడూ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆర్థిక విధానాలు సక్రమంగా అమలు చేసి ఉంటే వారి హయాంలోనే భారత్ ఈ ఘనత సాధించింది ఉండేది. కానీ, వారు అప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు’’ అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ప్రపంచ బ్యాంక్ వారి పాలన సమయంలోనే ఈజ్ బిజినెస్ డూయింగ్ ర్యాంకులు ఇవ్వటం మొదలుపెట్టిందన్న మోదీ.. ఇప్పుడు ఆ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవితంలో వరల్డ్ బ్యాంక్ భవనం మొహం కూడా చూడలేదని ఛలోక్తులు పేల్చాడు. విమర్శలు మాని నవ భారత్ కోసం అంతా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విమర్శకులను తాను పట్టించుకోబోనని.. దేశ ప్రజల జీవితాన్ని మార్చటమే తన ముందున్న లక్ష్యమని మోదీ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన శ్రమను ప్రపంచబ్యాంక్ గుర్తించిందన్నారు. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ఆహ్వానిస్తున్నదని, కేవలం ఒక్క ఏడాదిలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ మెరుగుపడడం అద్భుతమన్నారు. దేశంలో జీఎస్టీ అమలు చేయడం వల్ల వ్యాపారాలు మరింత సులువైనాయని ప్రధాని అన్నారు. జీఎస్టీలో అవసరమైన మార్పులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ కలిసి ఇంకా అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది నివేదికలో మరింత మెరుగైన ర్యాంక్‌ను సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత ర్యాంకు 142 నుంచి 100 స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే అది బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘనత కాదని.. తమ సంతృప్తి కోసం ఆర్థిక మంత్రి జైట్లీ అలాంటి ప్రకటన చేయించారంటూ కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి మోదీ నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయని విమర్శించింది. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కౌంటర్ కూడా ఇచ్చారు. యూపీ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ కరఫ్షన్ గా విరజిల్లిందంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: భారత్ హై జంప్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ లో ఈ ఏడాది భారత్ మెరుగైన స్థానాన్ని కొట్టేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్-2018 జాబితాను మంగళవారం సాయంత్రం ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. 190 దేశాలున్న ఈ జాబితాలో ఇండియా 100 స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది 130 స్థానంలో ఉన్న భారత్ బిగ్ జంప్ చేసింది. 30 స్థానాలు ఎగబాకి టాప్ -100లో చోటు దక్కించుకుంది. దక్షిణ ఆసియాలో టాప్ 100లో చోటు దక్కించుకున్న దేశంగా ఇండియా నిలిచిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నిర్మాణాత్మక సంస్కరణలను చేపడుతున్న దేశంగా భారతదేశం నిలిచిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొందని జైట్లీ వెల్లడించారు. 10 సూచికల్లో తొమ్మిందిటిలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుందని చెప్పారు. ముఖ్యంగా సంస్కరణల్లో టాప్ గా నిలిచింది. ఇన్సాల్వెన్సీ పరిష్కారంలో 136నుంచి 103ర్యాంక్‌కు ఎగబాకింది. విద్యుత్ కనెక్షన్ పొందడంలో 29వ ర్యాంకును దక్కించుకుందని, వ్యాపారం ఆరంభంలో, మైనార్టీ పెట్టుబడుదారుల రక్షణలో, ఆస్తుల నమోదులో పురోగతి సాధించింది. క్రెడిట్ పొందడంలో 44నుంచి 29ర్యాంకుకు చేరింది. పన్నుల చెల్లింపులో 172నుంచి 119 ర్యాంకును, ఆస్తుల నమోదులో మాత్రం క్షీణించింది. ప్రపంచ బ్యాంకు డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ 10 సూచికల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్మాణ అనుమతి, విద్యుత్ పొందడం, ఆస్తిని నమోదు చేయడం, క్రెడిట్ పొందడం, మైనారిటీ పెట్టుబడిదారులను రక్షించడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో ట్రేడింగ్, ఒప్పందాలను అమలు చేయడం, దివాలా తీర్మానం వీటిల్లోఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్థికవేత్తలు, ఆడిటర్లు, సర్వే సంస్థల కృషితో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తుంది. వివిధ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలను అధ్యయనం చేస్తారు. కాగా 2001లో మొదటిసారిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రారంభించిన ప్రపంచబ్యాంకు 2003లో మొదటిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టును ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఇండెక్స్‌లో ప్రపంచంలోని 190 దేశాలకు ర్యాంకులు ఇస్తుంది. -
అగ్రస్థానాలు కోల్పోయిన తెలంగాణ, ఏపీ
సులభ వాణిజ్యం ర్యాంకుల్లో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సులభ వాణిజ్యం (ఈవోడీబీ)లో కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) ఇచ్చే తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి మూడు, నాలుగో స్థానాలకు తగ్గాయి. తాత్కాలిక ర్యాంకుల్లో కొంతకాలంగా తెలంగాణ మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈవోడీబీపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన 340 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రాలు డిప్‌కు తమ సమాధానాలు సమర్పించాయి. ఆ సమాధానాల్లో సవరణలకు ఆగస్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. తాజాగా గురువారం ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో తెలంగాణ 61.45 స్కోరుతో మూడో స్థానంలో, ఏపీ 56.05 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాయి. 63.72 స్కోరుతో ఉత్తరాఖండ్ తొలిస్థానంలో, 62.94 స్కోరుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి తుది ర్యాంకులు ప్రకటించేందుకు డిప్ సన్నాహాలు చేస్తోంది. అప్పటి వరకు తాత్కాలిక ర్యాంకుల్లో తరచూ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. -
తెలంగాణ ఫస్ట్, ఆంధ్రా సెకండ్!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేసిన 2015 ర్యాంకులలో ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్‌లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానానికి పడిపోయింది. దాంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆ తర్వాతే తాము సైట్లో పెట్టిన వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ చేసిందంటూ తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొట్లాటకు దారితీసింది. అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం)’ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘డిప్’ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పేరిట ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈవోడీబీ ర్యాంకును ఆశించే రాష్ట్రాలు డిప్ సూచించిన 340 ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలను సమర్పించాలి. ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం, సమాధానాల పురోగతిని పర్యవేక్షించేందుకు ‘ఆన్లైన్ డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు శాఖలవారీగా సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాలు జూన్ 30లోగా సులభ వాణిజ్యానికి వీలు కల్పించేలా తాము చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను సమర్పించాలని డిప్ గడువు విధించింది. జూన్ 28, 29 తేదీల్లో వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆధారాల సమర్పణ గడువును జూలై ఏడో తేదీ వరకు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.