సాక్షి, అమరావతి: పెట్టుబడులకు అనువైన వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 300 అంశాలను పరిశీలించి కేంద్రం ర్యాంకింగ్స్ ఇచ్చింది, అంతే కాక పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధిని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమైందని, 4 లక్షల ఉద్యోగాలంటూ యువతను మోసం చేసిన ఘనత వారిదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment