వాస్తవ రూపంలోకి ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు | ONGC huge investments into reality | Sakshi
Sakshi News home page

వాస్తవ రూపంలోకి ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు

Published Mon, Aug 26 2024 5:43 AM | Last Updated on Mon, Aug 26 2024 5:53 AM

ONGC huge investments into reality

కేజీ బేసిన్‌లో రూ.42,081 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఓఎన్‌జీసీ

కేజీడీ–5 బ్లాక్‌లో అయిదో చమురు బావి నుంచి ఆయిల్‌ ఉత్పత్తి ప్రారంభం

ఈ ఏడాది మొదట్లో 4 బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభం

2021లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి పెట్టుబడుల ప్రణాళిక వెల్లడి

గత ప్రభుత్వ ప్రోత్సాహంతో పనులు వేగవంతం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)  పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తు­న్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసి­న్‌ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్‌జీసీ తాజాగా అ­యి­దో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్‌లోని క్లస్టర్‌–2­లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చ­ము­రును వెలికి తీసి­నట్లు ఆదివారం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయ­డమే కాకుండా దా­న్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్ప­త్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్‌ ప్రొడక్షన్, స్టోరే­జ్, ఆఫ్‌ లోడింగ్‌ వెజల్‌ (ఎఫ్‌పీఎస్‌వో) ద్వా­రా సముద్రం నుంచి తీరానికి చేరు­స్తోంది. 

ఇందు­కోసం ఆర్మదా స్టెర్లింగ్‌–వీ ఫ్లోటింగ్‌ రిఫైనరీని ఓ­ఎన్‌జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్‌–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బా­వులు ద్వారా 23.52 మిలియన్‌ మె­ట్రిక్‌ టన్నుల చమురు, 50.70 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవు­తుందని ఓ­ఎన్‌జీసీ అంచనా. ఓఎన్‌జీసీ కేజీ బేసిన్‌లో మొత్తం చమురు సహజ వాయువు అన్వే­షణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్‌ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. 

రిలయన్స్‌  కేజీడీ–6 బ్లాక్‌కు కూత వేటు దూరంలోనే ఓఎన్‌జీసీ కేజీ–డీ5 బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది.  బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్‌జీసీ మొదటి రెండు క్లస్టర్‌ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్‌ నాటికి గ్యాస్‌ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాల­న్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది.

గత ప్రభుత్వ అండతో.. 
తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్‌జీసీ కృష్ణా గోదావరి బేసిన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. జగన్‌ సీఎం అవగానే  కేజీ–డీ5 బ్లాక్‌ అభివృద్ధికి మద్దతి వ్వాల్సిందిగా ఓఎన్‌జీసీ అధికారులు కోరారు. నవంబర్‌1, 2019లో ఓఎన్‌జీసీ ఈడీ ఏజే మార్బుల్‌ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం జగన్‌ను కలిసి కేజీ–డీ5 ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కా­కుండా వేగంగా అనుమతులు మంజూరు చేయ­డంతో పనులు శరవేగంగా జరిగాయి. 

2021కే ఉత్ప­త్తి ప్రారంభించాలని ఓఎన్‌జీసీ లక్ష్యంగా పె­ట్టుకోగా కోవిడ్‌ పరిణామాలతో పనులు ఆలస్య­మయ్యాయి. ఆ తర్వాత ఓఎన్‌జీసీ చైర్మన్‌ సుభాష్‌ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌తో కలిసి సెప్టెంబర్‌22, 2021న నాటి సీఎం జగన్‌ను కలిసి కేజీ బేసిన్‌లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒకొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement