డిగ్రీ చదివిన, ఇంటర్ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఇ.పి.టి.ఆర్.ఐ.) ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖకు అనుబంధ సంస్థ ఇది. 2 నుంచి 4 వారాల కాల పరిమితి గల ఈ కోర్సుల్లో శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంస్థ ఆవరణలోనే ఉచితంగా భోజనం, వసతి కల్పించి, ఉచిత శిక్షణ ఇస్తామని శాస్త్రవేత్త, సమన్వయకర్త డాక్టర్ ఎం.సునీల ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఇవ్వనున్న కోర్సుల వివరాలు..
వాటర్ బడ్జెటింగ్ అండ్ ఆడిటింగ్ :
అర్హత – ఏదైనా డిగ్రీ, కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు. 2020 జనవరి 18 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
పర్యావరణ సేవలు, గ్రీన్ జీడీపీ గణన:
అర్హత – ఏదైనా డిగ్రీ, కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 10 నుంచి మార్చి 24 వరకు. 2020 జనవరి 25 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
సౌర విద్యుత్తు వ్యవస్థల్లో సాంకేతిక నైపుణ్యం:
ఇంటర్ మధ్యలో మానేసిన వారు లేదా పాసైన వారు అర్హులు. కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 24 వరకు. 2020 జనవరి 30 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
వేస్ట్ మేనేజ్‌మెంట్(అన్నిరకాల వ్యర్థాల నిర్వహణ) :
అర్హత – సైన్స్ డిగ్రీ. కోర్సు కాలం– 2020 జనవరి 29 నుంచి మార్చి 13 వరకు. 2020 జనవరి 13 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
ఇ.టి.పి/ ఎస్.టి.పి. / సి.ఇ.టి.పి. ఆపరేషన్, మెయింట్‌నెన్స్:
అర్హత – సైన్స్ డిగ్రీ. కోర్సు కాలం– 2020 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 17 వరకు. 2020 జనవరి 18 లోగా దరఖాస్తు పెట్టుకోవాలి.
► దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
ఈ క్రింది వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు:
లేదంటే మీ దరఖాస్తును ఈ కింది అడ్రస్‌కు మెయిల్ పంపవచ్చు:
eptri.gsdp@gmail.com
వివరాలకు...040--67567511, 67567553, 67567521 www.eptri.com
Comments
Please login to add a commentAdd a comment