వాహనాల దొంగ అరెస్ట్
Published Sun, Oct 9 2016 12:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
మరిపెడ : వాహనాలను చోరీ చేసిన దొంగను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేందర్‌నాయక్ తెలిపారు. స్థానిక పీఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన చోరీకి సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. మరి పెడ మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి విజయ్‌కుమార్ వివిధ ప్రాంతాల నుంచి 16 ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. మరిపెడ ఎస్‌సైలు నరేష్, నందీలు శనివారం ఉద యం మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో విజయ్ కుమార్ గ్లామర్ వాహనంపై తడబడుతూ కనిపించాడు. అప్రమత్తమై న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మరో 15 వా హనాలు చోరీ చేసినట్లు వెల్లడించా డు. దీంతో ఆ వాహనాలను అతడి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
16 వాహనాలకు ఒకే తాళం..
చోరీ చేసిన వాహనాలన్నింటికి నిం దితుడు ఒకే తాళం ఉపయోగించినట్లు డీఎస్పీ తెలిపారు. విజయ్‌కుమార్ గతంలో ద్విచక్రవాహన మెకానిక్‌గా పనిచేశాడు. అతడు ఏ ద్విచక్ర వాహనం తాళమైనా తీసేటట్లు ఓ తాళం చెవిని సృష్టించి ఈ చోరీలకు పాల్పడ్డాడు. మరిపెడ ప్రాంతంలో ఇంతపెద్ద ఎత్తున వాహనాలు దొరకడం ఇదే ప్రథమం. ఈ బైక్‌లను మరిపెడ మండలంతోపాటు పాటు తొర్రూరు, కురవి, కొడకండ్ల మండలాలతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రం లో వాహనాలు దొంగిలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఎస్సైలను అభినందించిన ఎస్పీ..
ఒక్కరోజులోనే నిందితుడితోపాటు 16 వాహనాలు స్వాధీనం చేసుకున్న సీఐ శ్రీనివాస్‌తోపాటు ఎస్సైలు నరేష్, నం దీప్, ఏఎస్సై రాంజీ, హెడ్‌కానిస్టేబుల్ చంద్రయ్య, అఫ్జల్, బిచ్చానాయక్, పీసీలు సమ్మలాల్, కరుణాకర్, శంకర్, రమేష్ తదితరులను ఎస్పీ అభినందించారని, వారికి రి వార్డులు అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement