కాశినాయన/పోరుమామిళ్ల, న్యూస్‌లైన్: కాశినాయన మండలంలోని రెడ్డికొట్టాలలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐకేపీలో ఆనిమేటర్‌గా పనిచేస్తున్న ఆదిబోయిన రామశేషయ్య(40) సజీవ దహనమయ్యాడు. అగ్నిమాపక అధికారి విజయకుమార్ కథనం మేరకు.. రామశేషయ్యకు భార్యతో పాటు యోగేశ్వర్, బిందు అనే ఇద్దరు పిల్లలున్నారు.
రామశేషయ్య అమ్మ బోద కొట్టంలో చిల్లర అంగడి వ్యాపారం చేసుకుంటూ ఉండేది. సాయంత్రం ఏమి జరిగిందో తెలియదుకానీ గుడిసెలో మంటలు లేచి ఒక్కసారిగా చుట్టుకున్నాయి. శేషయ్య కుమారుడు యోగి(16) మంటలకు కాలి కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. శేషయ్య గుడిసెలో చిక్కుకుపోయి మాడిపోయాడు. లోపల కిరోసిన్ లేదా పెట్రోల్ వుండటం వల్ల మంటలు తీవ్రస్థాయిలో లేచినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోరుమామిళ్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడి వెళ్లి మంటలకు ఆర్పివేశాక, రామశేషయ్య మృతదేహం మాడిపోయిన స్థితిలో కనిపించింది. కుటుంబ యజమాని మరణించడంతో ఆ కుటుంబం వీధినపడ్డట్లైంది.
ఐకేపీ ఆనిమేటర్ సజీవ దహనం
Published Wed, Apr 2 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM
Advertisement
Advertisement