తెలంగాణ రాష్ట్ర సమితికి సీపీఐ, సీపీఎం ఎలా మద్దతు ఇచ్చాయని బుధవారం మఖ్దూంభవన్‌లో జరిగిన భేటీలో
సీపీఐ, సీపీఎంలకు ఇతర వామపక్షాల నిలదీత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితికి సీపీఐ, సీపీఎం ఎలా మద్దతు ఇచ్చాయని బుధవారం మఖ్దూంభవన్‌లో జరిగిన భేటీలో ఇతరవామపక్ష పార్టీల నాయకులు నిలదీశారు. ఇటీవలి మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సీపీఐ, సీపీఎం ఏ విధంగా మద్దతిచ్చాయని సీపీఐ ఎంఎల్ నాయకుడు గుర్రం విజయ్‌కుమార్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎంసీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు తెలిపినట్లు తెలిసింది.
ప్రజా సమస్యలపై వామపక్షపార్టీలుగా ఉమ్మడిగా వ్యవహరిస్తుండగా, మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల చేటు జరుగుతుందని వారు పేర్కొన్నట్లు సవూచారం. దీనిపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ బూర్జువా పార్టీలతో పొత్తు, మద్దతు విషయంపై పార్టీ కేంద్రకమిటీ త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటించనున్నదని చెప్పారు.