Jayanagar
-
16 ఓట్లతో గెలుపు తారుమారు.. కన్నీటి పర్యంతమైన సౌమ్యారెడ్డి
30 వేలు, 40 వేల ఓట్లతో ఓడిపోవడం వేరు. రాష్ట్రమంతటా ఎదురుగాలి వీచినప్పుడు అందరితో పాటు ఓటమి పాలైతే పెద్ద బాధ ఉండదు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్రమంతా హస్తం పవనాలు వీచాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి 160 ఓట్లతో గెలిచి హమ్మయ్య అనుకున్నారు. కానీ బీజేపీ డిమాండ్‌తో పదే పదే రీకౌంటింగ్ జరిపి చివరకు 16 ఓట్లతో ప్రత్యర్తిని గెలుపు వరించింది. బెంగళూరు జయనగర నియోజకవర్గంలో అతి స్వల్ప ఓట్లు అభ్యర్థుల రాతను తారుమారు చేశాయి. బెంగళూరు: ఐటీ సిటీలో జయనగర నియోజకవర్గంలో నాటకీయ పరిణామాల మధ్య విజేత మారిపోయారు. తొలుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించడంతో సంబరాలు మిన్నంటాయి. అంతలోనే బీజేపీ నాయకులు పట్టుబట్టి రీకౌంటింగ్ చేయించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి సీకే.రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు అధికారులు తెలిపారు. దీంతో క్షణాల్లో పరిస్థితి మారిపోయింది. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ ఏకధాటిగా హైడ్రామా టెన్షన్ పుట్టించింది. పోటాపోటీగా రౌండ్లు జయనగర ఎస్‌ఎస్‌ఎంఆర్‌వీ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ఆరంభమైంది. ప్రతి రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే సౌమ్యారెడ్డి 160 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ప్రకటించగానే ఆమెతో పాటు కార్యకర్తల సంతోషానికి హద్దుల్లేవు. కానీ ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్ చేయాలని బీజేపీ అభ్యర్థి రామూర్తి డిమాండ్ చేయడంతో మళ్లీ రీకౌంటింగ్ ప్రారంభించారు. చదవండి: ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య భేటీ? గెలుపు ప్రకటన జిల్లా ఎన్నికల అధికారి తుషార్ గిరినాథ్ రీకౌంటింగ్ చేసిన విధానం గురించి నేతలకు వివరించి, సీకే రామమూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. బీజేపీకి 57,797 ఓట్లు, కాంగ్రెస్‌కు 57,781 ఓట్లు వచ్చాయని తెలిపారు. కార్యకర్తల ధర్నా దీంతో కాంగ్రెస్ నేతలు గత్యంతరం లేక ఇంటి ముఖం పట్టారు. గెలుపు దక్కి మళ్లీ ఓటమి పాలు కావడంతో సౌమ్యారెడ్డి విలపించారు. 16 ఓట్ల మెజారిటీతో సీకే రామూర్తి గెలుపు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కౌంటింగ్‌లో గోల్మాల్ జరిగిందంటూ అర్దగంటకు పైగా ధర్నాకు దిగారు. కాగా, ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని సౌమ్యారెడ్డి నిర్ణయించారు. పదేపదే ఓట్ల లెక్కింపు మొదటిసారి నిర్వహించిన రీకౌంటింగ్‌ను ఇద్దరు అభ్యర్థులు ఒప్పుకోలేదు. దీంతో వరుసగా మూడుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఈ సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి, ఎంపీ డీకే.సురేశ్, కేపీసీసీ చీఫ్ డీకే.శివకుమార్, ఇక బీజేపీ నేతలు ఆర్.అశోక్, ఎంపీ తేజస్విసూర్య మకాం పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న సౌమ్యారెడ్డి
-
‘కూల్.. కూల్ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’: మోదీ
కోల్కత్తా: ‘మేం పక్కా 200 సీట్లు గెలుస్తాం.. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా గెలుస్తాం.. మీలాగా సీజనల్ భక్తులం కాదు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మొదటి దశ పోలింగ్‌తో తెలిసింది.. ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జయనగర్‌లో గురువారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మమత బెనర్జీపై విమర్శలు చేస్తూనే తాము గెలవబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ‘‘కూల్ కూల్.. 200 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలవబోతోంది. మొదటి దశ పోలింగ్‌తో అధికంగా గెలుస్తామని తెలుస్తోంది. ప్రజల గళానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.’ అని పేర్కొన్నారు. నేను ఆలయాలకు వెళ్లడం గర్వంగా భావిస్తా.. మీలాగా పూటకోలాగ ఉండను’ అని బంగ్లాదేశ్ పర్యటనపై తృణమూల్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మోదీ ఘాటుగా బదులిచ్చారు. నేను ఆలయాన్ని సందర్శించడం తప్పా? అని ప్రజలను పశ్నించారు. మమతాకు కాషాయ వస్త్రాలు, దుర్గ మాత నిమజ్జనాలు, జై శ్రీరామ్ నినాదాలు అన్నీ ఆక్రోశం తెప్పిస్తున్నాయని తెలిపారు. బెంగాల్లో బీజేపీ హవా.. కమలం హవా కొనసాగుతుందని.. రెండో దశ పోలింగ్‌కు వస్తున్న ఓటర్లను చూస్తుంటే తెలుస్తోందని మోదీ పేర్కొన్నారు. -
సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?
బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక) అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్) కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు. వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. -
కాంగ్రెస్‌దే జయనగర
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి 2,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడినుంచి గెలిచింది. జూన్ 11న ఎన్నిక జరగగా బుధవారం నువ్వా–నేనా అన్నట్లుగా సాగిన లెక్కింపులో చివరకు సౌమ్యారెడ్డి పైచేయి సాధించారు. ఈమెకు 54,457 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌కు 51,568 ఓట్లు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. సౌమ్యారెడ్డి యువ నాయకురాలిగా జయనగరలో సుపరిచితం. సేవా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మే 12న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగాల్సి ఉండగా.. అయితే బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ పోలింగ్‌కు రెండ్రోజుల ముందు గుండెపోటుతో మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. విజయకుమార్ సోదరుడు ప్రహ్లాద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి జేడీఎస్ మద్దతు తెలిపింది. అసెంబ్లీలో తండ్రీ కూతుళ్లు సౌమ్య తండ్రి రామలింగారెడ్డి గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తండ్రీకూతుళ్లు ఎమ్మెల్యేలుగా ఉండటం కన్నడ చరిత్రలో ఇదే తొలిసారి. గత నెల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు స్థానాలు దక్కించుకోవడం తెలిసిందే. ఈ గెలుపుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగినా, ఇటీవల జమఖండి ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 79కి తగ్గింది. జయనగరలో సానుభూతి గట్టెక్కిస్తుందని బీజేపీ ఎంతగానో ఆశలు పెట్టుకుంది. అయితే ముఖ్య నాయకుల సహాయ నిరాకరణ బీజేపీ ఓటమికి కారణమైంది. -
బెంగళూరుపై కాంగ్రెస్ పట్టు; యడ్డీ అప్సెట్!
సాక్షి, బెంగళూరు: దశాబ్దకాలం తర్వాత భారత ఐటీ రాజధాని బెంగళూరు నగరంపై కాంగ్రెస్ పార్టీ తిరిగి గట్టి పట్టు సాధించినట్లైంది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో జయనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి గెలుపొందడంతో సిటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు పెరిగింది. బెంగళూరు నగర పరిధిలో మొత్తం 28 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, బీజేపీ 11 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.. అందునా ఐదు చోట్ల బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి తారుమారు అవుతున్నదనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని, 2019లో బెంగళూరులోని అన్ని లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 70 శాతం మంది మిడిల్ క్లాసే! : దక్షిణ బెంగళూరులోని జయనగర్ నియోజకవర్గంలో 70 శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న జయనగర్ స్థానంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కూడా అయిన విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నిక జూన్ 11కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. గడిచిన పదేళ్లుగా జయగనర్‌లో బీజేపీదే ఆధిక్యం. గతంలో ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలుపొంది, డీలిమిటేషన్ తర్వాత వేరే స్థానానికి వెళ్లిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. రామలింగారెడ్డి.. ఈ దఫా జయనగర్ నుంచి తన కూతురు సౌమ్య రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇప్పటికే జేడీయూ-కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా మిత్రపక్షాలకు చెందిన పెద్ద నాయకులెవరూ ప్రచారానికి రాలేదు. దీంతో రామలింగారెడ్డే అంతా తానై వ్యవహరించారు. బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్(దివంగత విజయ్‌కుమార్ సోదరుడు)పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. యడ్యూరప్ప కస్సుబుస్సు: జయనగర్‌లో పార్టీ ఓటమిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తీవ్రఅసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండా ముఖంచాటేశారు. జయనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్ వల్లే పార్టీ ఓడిపోయిందని యడ్డీ తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ప్రచార బాధ్యతలు తీసకున్న అనంతకుమార్.. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించారని, ఎగువ మధ్యతరగతి ఓట్లు అధికంగా ఉన్న జయనగర్‌లో బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని భావించినా, చేదు ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చిందని యడ్డీ కస్సుబుస్సులాడినట్లు తెలిసింది. -
జయనగరలో బీజేపీకి షాక్
బెంగళూరు : జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. తాజా గెలుపుతో కాంగ్రెస్ బలం 80కి చేరింది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి జూన్ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించడం.. కాంగ్రెస్ విజయానికి కలిసొచ్చింది. జయనగర్ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ సెంటర్ బయట డ్యాన్స్‌లు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. -
జయనగరలో పోలింగ్ ప్రశాంతం
జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. జూన్ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. -
దొంగలతో తలపడిన అక్కాచెల్లెల్లు
-
వైరల్ వీడియో; దొంగలతో తలపడిన అక్కాచెల్లెళ్లు
సాక్షి, బెంగుళూరు: నగరంలోని ఓ నగల దుకాణంలో ఓ ముఠా దోపిడీకి యత్నించడంతో కలకలం రేగింది. అయితే ఆ నగల వ్యాపారి కూతుళ్లిద్దరూ ధైర్యంగా వారికి ఎదురు తిరగడంతో ఆరుగురు సభ్యుల ఆ దొంగల ముఠా తోక ముడిచింది. ఈ ఘటన దక్షిణ బెంగుళూరులో రెండు వారాల క్రితం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయానగర్‌లోని అశోక్ పిల్లర్ సమీపంలో రఘు(62) అనే వ్యక్తికి నగల కొట్టు ఉంది. మే 21(సోమవారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఓ ఆగంతకుడు నెక్లెస్ చూపించమని షాప్‌లో దూరాడు. అతని మాటలు నమ్మి రఘు షోకేస్ నుంచి నెక్లెస్ బయటకు తీయగానే మిగతా నగలన్నీ బయటపెట్టాలంటూ ఆ దొంగ కత్తి చూపించి బెదిరించాడు. ఏం జరుగుతుందో తెలియక అతను నిశ్చేష్టుడయ్యాడు. అదే సమయంలో బయట కాపలాగా ఉన్న మిగతా అయిదుగురు దొంగలు కుడా లోపలికి ప్రవేశించడంతో రఘు సహాయం కోసం కేకలు వేశాడు. అక్కడే ఉన్న అతని కూతుళ్లిద్దరూ వెంటనే స్పందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకుని ధైర్యంగా వారిని ప్రతిఘటించారు. తండ్రీ, కూతుళ్లు ఆ దొంగల ముఠాను బయటకు నెట్టారు. రద్దీ ప్రాంతం కావడంతో దొరికిపోతామనే భయంతో దుండగులు అక్కడ నుంచి జారుకున్నారు. కేసు నమోదు చేశామనీ, దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దుండగులు హెల్మెట్ ధరించడంతో దర్యాప్తు కొంత ఆలస్యమవ్వొచ్చని అన్నారు. దోపిడీ యత్నం జరిగిన విధానాన్ని బట్టి వారు ప్రొఫెషనల్ దొంగలు కాకపోవచ్చని పోలీసులు తెలిపారు. -
సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు
► సినిమా ప్రచారంలో విభేదాలు ►వ్యక్తి కిడ్నాప్, చిత్రహింసలు ►కేసు ఛేదించిన ఖాకీలు ఇది సినిమా స్క్రిప్టుకు ఏమాత్రం తీసిపోదు. డైరెక్టర్ సినిమా తెలివితేటలను నిజ జీవితంలో ఉపయోగించాడు. తన చిత్రానికి ప్రచార బాధ్యతలు చూస్తున్న వ్యక్తిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి మూడురోజులు హింసించిన నేరానికి కటకటాల పాలయ్యాడు. ఇలా అనుకోకుండానే తన సినిమాకు ప్రచారాన్ని సంపాదించుకున్నాడనడంలో సందేహం లేదు. జయనగర: సినిమా (అడ్వర్డైజింగ్) ప్రకటనల విభాగం డైరెక్టర్ పరమేశ్‌ను కిడ్నాప్ చేసిన ‘వేగ’ సినిమా డైరెక్టర్‌తో పాటు ఐదుగురిని బెంగళూరు మాగడిరోడ్డు పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. శనివారం ఆయన మీడియా భేటీలో వివరాలను వెల్లడించిన మేరకు... వేగ అనే కన్నడ సినిమాకు డైరెక్టర్ చలపతి ఎరడు. అతను కనసు సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన మదన్ సలహా మేరకు సినిమా ప్రచారం బాధ్యతలను పరమేశ్ అనే వ్యక్తికి అప్పగించి రూ.16 లక్షల అందజేశాడు. కాని పరమేశ్ ప్రచారం సక్రమంగా నిర్వహించలేదని గొడవకు దిగిన డైరెక్టర్ చలపతి రూ.8 లక్షలు తిరిగి ఇవ్వాలని పరమేశ్‌ను అడిగాడు. ప్రచారం కోసం ఇప్పటికే రూ.13 లక్షలు ఖర్చు అయిందని అతను సమాధానమిచ్చాడు. ఈ విషయం పై ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. తోటలో బంధించి గొడవలో తీవ్రకోపోద్రిక్తుడైన చలపతి తన అనుచరులైన కృష్ణరాజపురం నివాసి కిరణ్, శెట్టిగెరె కు చెందిన మూర్తి, మోహన్, కాడయరప్పనహళ్లి నివాసి మదన్ అనే నలుగురితో పరమేశ్ కిడ్నాప్‌నకు పథకం వేశాడు. 24వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో బసవేశ్వరనగర పుష్పాంజలి థియేటర్ వద్ద పరమేశ్‌ను కారులో కిడ్నాప్ చేసి దేవనహళ్లి సమీపంలోని కాడయరప్పనహళ్లిలో ఉన్న తోటలోకి తీసుకెళ్లి గదిలో బంధించారు. మూడురోజుల పాటు పరమేశ్వర్‌ను తీవ్రంగా కొట్టి రూ.8 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండురోజుల పాటు పరమేశ్ ఆచూకీ కనబడకపోవడంతో కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం మాగడిరోడ్డు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మాగడిపోలీస్స్టేషన్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ హరీశ్ పోలీస్‌బృందం తీవ్రంగా గాలించి తోటలోని ఇంటిపై దాడిచేసి పరమేశ్‌ను విడుదల చేయించారు. వేగ సినిమా డైరెక్టర్ చలపతి, మూర్తి, మోహన్, మదన్, కిరణ్ అనే ఐదుగురిని అరెస్టుచేసి, ఒక క్వాలిస్‌కారు, 5 సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.