ప్రహ్లాద, సౌమ్యరెడ్డి (ఫైల్ ఫొటో)
బెంగళూరు : జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్య రెడ్డి 2,889 ఓట్ల వెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 54,457 ఓట్లు నమోదవ్వగా.. బీజేపీకి 51,568 ఓట్లు వచ్చాయి. తాజా గెలుపుతో కాంగ్రెస్ బలం 80కి చేరింది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అకస్మిక మరణంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ ఈ స్థానానికి జూన్ 11న( సోమవారం) ఎన్నికలు నిర్వహించగా 55శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికలో బీజేపీ తరపున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య రెడ్డి పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించడం.. కాంగ్రెస్ విజయానికి కలిసొచ్చింది. జయనగర్ ఫలితాలు అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ సెంటర్ బయట డ్యాన్స్‌లు చేస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment