పోచమ్మమైదాన్ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బరిలో మొత్తం 398 మంది అభ్యర్థు లు నిలిచారు. వీరిలో ఎక్కువ మంది విజయం సాధించాల న్న తపనతో ఇంటింటికీ తిరి గి ఓటర్లను ఆకట్టుకునేం దుకు యత్నించారు. అయితే, ఎవరు ఎంత ప్రచారం చేసినా.. ఎన్ని ఎత్తులు వేసి నా విజయం సాధించింది 58 మందే. అయితే, గెలిచిన వారిలో కొందరు తమకు పోటీనే లేదంటూ ప్రతీ రౌండ్‌లో ఆధికత్య ప్రదర్శించగా.. మరికొందరు మాత్రం అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించారు. ఆ వివరాలు...
అతి తక్కువ మెజార్టీతో 46వ డివిజన్ నుంచి విజయం సాధించిన సిరంగి సునీల్‌కుమార్, 35వ డివిజన్ నుంచి గెలిచిన బస్కె శ్రీలత ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులే కావడం.. వీరిద్దరు గెలిచింది టీఆర్‌ఎస్ అభ్యర్థుల పైనే కావడం విశేషం. ఇక 38 డివిజన్ నుంచి తక్కువ ఓట్లతో బయటపడిన టీఆర్‌ఎస్ కె.మాధవి తర్వాత బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు.
పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు 329 46వ డివిజన్ నుంచి 27ఓట్లు
హన్మకొండ అర్బన్ : గ్రేటర్ వరంగల్ ముని సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మొత్తం 329 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల య్యాయి. ఇందులో అత్యధికంగా 46వ డివి జన్ నుంచి 27 ఓట్లు నమోదు కావడం విశే షం. ఇక 38వ డివిజన్ నుంచి 23ఓట్లు పో స్టల్ ఓట్లు వచ్చాయి.
21లో అత్యధికం.. 46లో అత్యల్పం
Published Thu, Mar 10 2016 1:36 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement