
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న వేళ అపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం తన నియోజకర్గం సిరిసిల్లలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి అక్కడికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో సిద్దపేటలోని గుర్రాల గొంది వద్ద కేటీఆర్‌కు హరీశ్ రావు ఎదురయ్యారు. తమ వాహనాల్లో నుంచి దిగివచ్చిన బావ బామ్మర్ధులు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌తో కేటీఆర్ మాట్లాడుతూ..‘బావ కంగ్రాట్స్.. నీకు లక్ష ఓట్ల మెజార్టీ ఖాయం. నీ మెజారిటీలో నేను సగం అన్న తెచ్చుకుంట’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న హరీశ్‌తో పాటు అక్కడున్న వారంత నవ్వులు చిందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన పోలింగ్ జరుగుతుందని ఇరువురు నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ తన బావ హరీశ్‌కు బాయ్ చెప్పి సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment