అందుకే ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాం : కేటీఆర్‌ | KTR Oppose The Allegations On Harish Rao | Sakshi
Sakshi News home page

అందుకే ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాం : కేటీఆర్‌

Published Tue, Nov 6 2018 3:16 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

KTR Oppose The Allegations On Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హరీశ్‌రావ్‌ గురించి దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. నాకు, హరీశ్‌రావుకు కుటుంబమే ఫస్ట్‌.. ఆ తర్వాతే రాజకీయాలు అంటూ తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో పుట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్‌లోకే వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీకి.. ఇప్పటికి టీడీపీకి సంబంధమే లేదని ఆరోంపించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తును తెలుగు ప్రజలు సహించడం లేదని తెలిపారు. సీఎం రమేష్‌పై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబుకు దేని గురించో భయం ఉంది.. అదేంటో త్వరలోనే తేలుతుందని వెల్లడించారు. దీపావళి తర్వాతే మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల్లో వంద స్థానాలు తగ్గకుండా గెలుస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హరీశ్‌రావ్‌పై వచ్చే ఆరోపణలన్ని అవాస్తవాలేనంటూ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎంఐఎం తమకు సాయం చేసిందని.. అందుకే ఎంఐఎంతో దోస్తి చేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement