
బీరంగూడలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
సాక్షి, పటాన్‌చెరు: తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక నాశనం చేసేందుకే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎత్తులు వేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని బీరంగూడలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నివసిస్తున్న వారంతా ఇక్కడి వారేనని పునరుద్ఘాటించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఆలోచించాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కొత్తగా 31 జిల్లాలు, కొత్త మండలాలతో గొప్పగా సాగుతున్న అభివృద్ధిని చూసి ఈర్ష్యతోనే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment