సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే నేతల మధ్య మాటలు వార్ నడుస్తోంది. ఇక, కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా, రేవంత్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై సంచలన కామెంట్స్ చేశారు.
అయితే, రేవంత్ శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పులు మోసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. చంద్రబాబు ఒప్పుకోకపోవడంతోనే కేసీఆర్ టీఆర్‌ఎస్ పెట్టారు. మంత్రి హరీశ్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని అన్నారు. హరీశ్ కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలువకముందే ఆయనను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందని అన్నారు. టీడీపీ సహకారంతోనే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతోనే మీరు బతికారని, మీరు పరాన్న జీవులని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిరిసిల్లలో జస్ట్ మిస్..
2009లో టీడీపీపై విరుచుకుపడ్డ కేసీఆర్ ఆ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. అదే సందర్భంలో సిరిసిల్లలో ఓటమి నుంచి 150 ఓట్ల మెజార్టీతో బయటపడ్డాడని వివరించారు. ఇదే సమయంలో ఉచిత కరెంట్ అంశంపైనా మాట్లాడుతూ.. తాను అమెరికాలో మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఉచిత కరెంట్ తెచ్చింది తొలిసారిగా కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నదని, ఎక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
పోచారం, గుత్తాలపై ఫైర్..
ఇదిలా ఉండగా.. పోచారం, గుత్తాలపైనా రేవంత్ మండిపడ్డారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. పోచారం తన కొడుకు అక్రమ దందాలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ చెప్పులు మోస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: వాలంటీర్లపై అవగాహన లేకుండా పవన్, బాబు మాట్లాడుతున్నారు: వైవీ సుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment