
సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం అన్నాదమ్ముల్లా కలిసి పెరిగామని ఆపద్ధర్మ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో రికార్డు స్థాయి మెజారిటీతో కేటీఆర్‌ను గెలిపించాలని కోరారు. అభివృద్ధి విషయంలో మాత్రం కేటీఆర్, తాను పోటీ పడతామని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు సాగాలని హరీశ్ తెలిపారు. మెజారిటీ విషయంలో సిరిసిల్ల సిద్దిపేటను దాటాలని కార్యకర్తలకు సూచించారు.
మా ఇద్దరి మధ్య విభేదాల్లేవు : కేటీఆర్
హరీశ్ రావుకి తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమ కాలం నుంచి హరీశ్, తాను తెలంగాణ కోసం పనిచేశామని గుర్తుచేశారు. ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశం లభించిందని... ఇదంతా తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన ఒక సువర్ణవకాశంగా భావిస్తున్నామన్నారు. మోజారిటీ విషయంలో సిద్దిపేటను దాటలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment