మూడేళ్ల చిన్నారి డ్రోన్ సాంకేతికతో విజయవంతంగా రక్షించారు అధికారులు. ఇలాంటి రెస్క్యూఆపరేషన్‌లో డ్రోన్ సాంకేతికత సమర్థవంతంగా ఉపయోగపడుతుందనే విషయం ఈ సంఘటనతో తేటతెల్లమయ్యింది.
అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని విస్కాన్సిన్‌లో ఆల్టోలో అనే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అదికూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దీనికితోడు దట్టమైన మొక్కజొన్న అడవి తదితర కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్‌ని మోహారించారు.
దీనిలోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరా హీట్ సిగ్నేచర్లు చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేయడంతో వీడియో తీయడం ప్రారంభించిన నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్‌పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలికలని నిర్థారణ చేశారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు.
ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా ఆ మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికత ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టొచ్చు లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నారు షెరీఫ్ కార్యాలయం అధికారులు.
(చదవండి: సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!)
Comments
Please login to add a commentAdd a comment