గతజన్మ ఉందని కొందరూ నమ్ముతుంటారు. అలాగే మన మత సంప్రదాయంలో ఆ విషయాల గురించి నొక్కి చెబతుంటాయి. అది వాస్తవికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది స్పష్టంగా తెలియదు. కానీ అందుకు సంబంధి పలు సినిమాలు మాత్రం వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చిన సినిమాలు భారీగా హిట్టయ్యాయి కూడా. అయితే ఈ విషయమై శాస్త్రవేత్తలు ఎన్నాళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. వారికి 1926లో జన్మించిన శాంతి దేవి కథ ఓ సవాలుగానూ ఆసక్తికరంగానూ మారింది. చెప్పాలంటే వారి పరిశోధనలకు సరైన సమాధానంగా ఆమె కేసు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అంతేగాదు ఆ కేసు పునర్జన్మ ఉందని నర్మగర్భంగా తేల్చి చెప్పింది.
వివరాల్లోకెళ్తే..1926 డిసెంబర్ 11న ఢిల్లీ నగరంలో శాంతి దేవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో పెద్దదానిలా మాట్లాడుతూ అందర్నీ ఆశ్యర్యపరిచింది. పైగా తనకు జన్మనిచ్చిన తల్లిందండ్రులనే కాదని తిరస్కరించింది. తనకు భర్త, పిల్లలు కుటుంబం ఉందంటూ నమ్మశక్యం కానీ గతజన్మ గురించి పలు ఆసక్తికర విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఈ విషయం దావానంలో భారతదేశం అంతటా వ్యాపించింది. అయితే ఆమె చెప్పే విషయాలను తల్లిదండ్రులు, స్నేహితులు కొట్టిపడేసేవారు.
పైగా పిచ్చిదానిలా చూసేవారు ప్రజలంతా. అయితే ఆమె చెప్పే విషయాలు ఎంతవరకు కరెక్ట్ అనేదిశగా పలువురు జర్నలిస్టులతో సహా 15 మంది వ్యక్తులతో కూడిన కమిటి వాస్తవికతను తెలసుకునేందుకు ఇన్విస్టిగేట్ చేయడం ప్రారంభించారు. వారిలో డాక్టర్ కీర్తి స్వరూప్ రావత్ అనే ప్రముక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి శాంతి దేవి కేసును బూటకం అంటూ విర్శిస్తూ ఉండేవారు. వాస్తవాలేంటో చూపించాలనే దిశాగా ఆయన దర్యాప్తులో పాలుపంచుకుని విస్తుపోవడం జరిగింది. దర్యాప్తు బృందం శాంతి దేవి చెబుతున్న గత జన్మకు సంబంధించిన వ్యక్తుల అడ్రస్ ఇవ్వమని అడిగారు. గత జన్మలో తన పేరు లుగ్దీ అని తన భర్తతో కలిసి మధురలో ఉండేదాన్ని అంటూ ఆ చిరునామ ఇచ్చింది.
అది నిజమా? కాదా? అని ఆ చిరునామాకు ఉత్తరం రాయగా రిప్లై వచ్చింది. అలాగే శాంతి దేవి చెప్పిన వివరాలు తమ కుటుంబంతో సరిపోయాయని ఆమె మా బంధువని అను పూర్తిగా విశ్వసిస్తున్నామని అని ఆ ఉత్తర సారాంశం. ఇక్కడ శాంతి దేవి ప్రస్తుత జన్మలో ఢిల్లీలో తల్లిదండ్రులతో జన్మిస్తుంది. ఆమె ఉన్న నివాసానికి దాదాపు 145 కిలోమీటర్లు దూరంలో మధుర ఉంది. ఇంతవరకు శాంతి దేవి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లింది కూడా లేదు. ఒక వైపు ఆ బృందం అంతా విచారణ చేస్తుండగా..శాంతి దేవి తన వాళ్లను కలవాలని పట్టుబట్టింది.
దీంతో వాళ్లు దేవి చెప్పిన వివరాల ప్రకారం ఆ బంధువులను తీసుకువచ్చారు వారందర్నీ గుర్తించింది. చివరగా ఆమె తన గత జన్మలో భర్తగా చెబుతున్న వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేయగా అతడిని గుర్తుపట్టింది. పైగా తన కొడుకును కలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత జన్మలో ఆమె భర్త పేరు కాంజి మాల్ చౌబే. ఆయన తన మూడో భార్యను తీసుకుని శాంతి దేవిని కలవడం జరిగింది. అంటే చౌబేకు గత జన్మలో శాంతి దేవి రెండో భార్య. ఆయన కూడా ఆమె గుర్తింపుని నిర్థారించేలా తమ ఇద్దరికే తెలిసిన సన్నిహిత ప్రశ్నలు అడిగారు. అందుకు శాంతి దేవి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది ఆమె తన భార్యగా గుర్తించడం విశేషం. నిజానికి మన మత సంప్రదాయాల ప్రకారం ఆత్మకు కొత్త జన్మరాగనే గత జన్మ తాలుకా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఆమెకు గుర్తుండటం ఆశ్చర్యం కలిగించడమే గాక పునర్జన్మ ఉంది అనేందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది శాంతి దేవి.
(చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment