కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్‌కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు.
దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment