Reincarnation
-
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్‌డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్‌డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్‌డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్‌డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్‌కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్‌దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. -
సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!
గతజన్మ ఉందని కొందరూ నమ్ముతుంటారు. అలాగే మన మత సంప్రదాయంలో ఆ విషయాల గురించి నొక్కి చెబతుంటాయి. అది వాస్తవికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది స్పష్టంగా తెలియదు. కానీ అందుకు సంబంధి పలు సినిమాలు మాత్రం వచ్చాయి. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని వచ్చిన సినిమాలు భారీగా హిట్టయ్యాయి కూడా. అయితే ఈ విషయమై శాస్త్రవేత్తలు ఎన్నాళ్లుగానో పరిశోధనలు చేస్తున్నారు. వారికి 1926లో జన్మించిన శాంతి దేవి కథ ఓ సవాలుగానూ ఆసక్తికరంగానూ మారింది. చెప్పాలంటే వారి పరిశోధనలకు సరైన సమాధానంగా ఆమె కేసు సజీవ సాక్ష్యంగా నిలిచింది. అంతేగాదు ఆ కేసు పునర్జన్మ ఉందని నర్మగర్భంగా తేల్చి చెప్పింది. వివరాల్లోకెళ్తే..1926 డిసెంబర్ 11న ఢిల్లీ నగరంలో శాంతి దేవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో పెద్దదానిలా మాట్లాడుతూ అందర్నీ ఆశ్యర్యపరిచింది. పైగా తనకు జన్మనిచ్చిన తల్లిందండ్రులనే కాదని తిరస్కరించింది. తనకు భర్త, పిల్లలు కుటుంబం ఉందంటూ నమ్మశక్యం కానీ గతజన్మ గురించి పలు ఆసక్తికర విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. ఈ విషయం దావానంలో భారతదేశం అంతటా వ్యాపించింది. అయితే ఆమె చెప్పే విషయాలను తల్లిదండ్రులు, స్నేహితులు కొట్టిపడేసేవారు. పైగా పిచ్చిదానిలా చూసేవారు ప్రజలంతా. అయితే ఆమె చెప్పే విషయాలు ఎంతవరకు కరెక్ట్ అనేదిశగా పలువురు జర్నలిస్టులతో సహా 15 మంది వ్యక్తులతో కూడిన కమిటి వాస్తవికతను తెలసుకునేందుకు ఇన్విస్టిగేట్ చేయడం ప్రారంభించారు. వారిలో డాక్టర్ కీర్తి స్వరూప్ రావత్ అనే ప్రముక సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి శాంతి దేవి కేసును బూటకం అంటూ విర్శిస్తూ ఉండేవారు. వాస్తవాలేంటో చూపించాలనే దిశాగా ఆయన దర్యాప్తులో పాలుపంచుకుని విస్తుపోవడం జరిగింది. దర్యాప్తు బృందం శాంతి దేవి చెబుతున్న గత జన్మకు సంబంధించిన వ్యక్తుల అడ్రస్ ఇవ్వమని అడిగారు. గత జన్మలో తన పేరు లుగ్దీ అని తన భర్తతో కలిసి మధురలో ఉండేదాన్ని అంటూ ఆ చిరునామ ఇచ్చింది. అది నిజమా? కాదా? అని ఆ చిరునామాకు ఉత్తరం రాయగా రిప్లై వచ్చింది. అలాగే శాంతి దేవి చెప్పిన వివరాలు తమ కుటుంబంతో సరిపోయాయని ఆమె మా బంధువని అను పూర్తిగా విశ్వసిస్తున్నామని అని ఆ ఉత్తర సారాంశం. ఇక్కడ శాంతి దేవి ప్రస్తుత జన్మలో ఢిల్లీలో తల్లిదండ్రులతో జన్మిస్తుంది. ఆమె ఉన్న నివాసానికి దాదాపు 145 కిలోమీటర్లు దూరంలో మధుర ఉంది. ఇంతవరకు శాంతి దేవి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లింది కూడా లేదు. ఒక వైపు ఆ బృందం అంతా విచారణ చేస్తుండగా..శాంతి దేవి తన వాళ్లను కలవాలని పట్టుబట్టింది. దీంతో వాళ్లు దేవి చెప్పిన వివరాల ప్రకారం ఆ బంధువులను తీసుకువచ్చారు వారందర్నీ గుర్తించింది. చివరగా ఆమె తన గత జన్మలో భర్తగా చెబుతున్న వ్యక్తిని కలిసేలా ఏర్పాటు చేయగా అతడిని గుర్తుపట్టింది. పైగా తన కొడుకును కలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత జన్మలో ఆమె భర్త పేరు కాంజి మాల్ చౌబే. ఆయన తన మూడో భార్యను తీసుకుని శాంతి దేవిని కలవడం జరిగింది. అంటే చౌబేకు గత జన్మలో శాంతి దేవి రెండో భార్య. ఆయన కూడా ఆమె గుర్తింపుని నిర్థారించేలా తమ ఇద్దరికే తెలిసిన సన్నిహిత ప్రశ్నలు అడిగారు. అందుకు శాంతి దేవి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది ఆమె తన భార్యగా గుర్తించడం విశేషం. నిజానికి మన మత సంప్రదాయాల ప్రకారం ఆత్మకు కొత్త జన్మరాగనే గత జన్మ తాలుకా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. కానీ ఆమెకు గుర్తుండటం ఆశ్చర్యం కలిగించడమే గాక పునర్జన్మ ఉంది అనేందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది శాంతి దేవి.(చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
చంద్రకళా.. నీది గొప్ప జన్మ
శ్రీకాకుళం: తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించిన పట్నాన చంద్రకళను గ్రామస్తులు వేనోళ్ల కీర్తించారు. చంద్రకళ చేసిన త్యాగం నిరుపమానమని, ఆమెది గొప్ప జన్మ అని కొనియాడారు. మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) బ్రెయిన్‌డెడ్ అవ్వడంతో ఈనెల 2వ తేదీన మృతి చెందారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను దానం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలో చంద్రకళ సంతాప సభ నిర్వహించారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో స్థానికులు, యువత కలిపి రూ.2 లక్షలు సేకరించి వారి పేరున డిపాజిట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ నల్లి తవిటినాయుడులతోపాటు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. ఈ కుటుంబంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ?
Sai Pallavi Believes In Reincarnation And Here Is How: సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'వచ్చిండే మెల మెల్లగా వచ్చిండే', 'దాని కుడి భుజం మీద కడవ' పాటలకు సాయి పల్లవి చేసిన డ్యాన్స్‌తో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తన నాట్యం, హావాభావాలతో ఆ పాటలకు మరింత పేరు వచ్చింది. దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా సాయి పల్లవి కొనసాగుతోంది. ప్రస్తుతం నానికి జంటగా సాయి పల్లవి నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి, మడొన్నా సెబాస్టియన్లు కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రం పునర్జన్మ, బెంగాల్ నేపథ్యంతో తెరకెక్కింది. ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి సాయి పల్లవి 'నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మేము మా పాత్రల గురించి, వాటిని ఇంకా బాగా ఎలా పోషించాలి అనే మాట్లాడుకునేవాళ్లం. ఎడిట్ చేసిన తర్వాత కూడా సీన్లను పరిశీలించి నోట్స్ షేర్ చేసుకునేవాళ్లం.' అని చెప్పింది. అలాగే పునర్జన్మను నమ్ముతారా అని సాయి పల్లవిని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది. 'అప్పుడప్పడు నేను ఒక యువరాణిని అనే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను ఆరు, ఏడు తరగతుల్లో ఉన్నప్పుడు ఈజిప్ట్ యువరాణులు, క్వీన్ నెఫెర్టిటి గురించి ఎక్కువగా చదివాను. నా గత జన్మలో నేను కచ్చితంగా యువరాణి అయి ఉంటా అని అనిపించింది నాకు. నేను పునర్జన్మను నమ్ముతాను.' అని మనసులోని మాటను బయటపెట్టింది సాయి పల్లవి. ఇదీ చదవండి: స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే శ్యామ్ సింగరాయ్ సినిమా కథ రెండు విభిన్న కాలక్రమాల్లో జరుగుతుందని సమాచారం. ఒకటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటే మరొకటి హైదరాబాద్‌లో ఉంటుంది. 'నేను 1960 కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథలో దేవదాసి పాత్రను పోషించాను. వ్యక్తిగతంగా ఇలాంటి మిస్టీరియస్ టైమ్ జోన్ చిత్రాల్లో నటించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆ కాలం నాటి సెట్స్‌లో ఉండటం, ఆనాటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను చాలా మంది బాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందులో నాకు మొదటగా గుర్తు వచ్చేది సంజయ్ లీలా బన్సాలీ. ఆయన సినిమాలు చూశాను. బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుందో నాకు తెలియదు. స్క్రిప్ట్‌కు తగినట్లుగా ఉంటేనే సినిమా ఒప్పుకుంటాను.' అని సాయి పల్లవి తెలిపింది. -
పునర్జన్మను నిరూపిస్తే మూడున్నర కోట్లు!
దేవుడు, దయ్యం, పాపం, పుణ్యం, ఆత్మ, పరమాత్మ అంటూ మనిషి పుట్టినప్పటి నుంచి తనకు అంతుపట్టని పలు అంశాలపై ఆలోచన చేస్తూనే ఉంటాడు. అయితే ఇలాంటి విషయాలపై ఆస్తికులకు ఉన్నంత ఆసక్తి నాస్తికులకుండదు. మరికొందరేమో సైన్సుకు, మత విశ్వాసాలకు ముడిపెట్టి రెండిటిలో ఏకత్వం సాధించాలని యత్నిస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రాచీన కాలం నుంచి మనిషికి తన భవిష్యత్ తెలుసుకోవడంపై ఆసక్తి అధికం. ఈ కాన్సెప్టులోంచి పుట్టిందే పునర్జన్మని కొందరి విశ్వాసం. భవిష్యత్‌లో మనం మళ్లీ జన్మిస్తామన్న ఆశ, పాపాలు చేస్తే మంచి పునర్జన్మ రాదన్న భయం.. ఈ జన్మలో మనం మంచి పనులు చేసేందుకు ప్రేరేపిస్తాయి. కానీ మనిషి ఎదిగేకొద్దీ వీటిపై నమ్మకం కోల్పోతున్నాడు. దీనివల్లనే సమాజంలో పాపభీతి తగ్గిపోతోందని మతాచార్యులు ఘోషిస్తున్నారు. అసలింతకీ పునర్జన్మలుంటాయా? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న. మిలియన్ డాలర్ల ప్రశ్న, బహుమతి.. ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం కోసం అక్షరాలా మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు అమెరికాకు చెందిన డబ్బున్న ఆసామి రాబర్ట్ బిగిలోవ్. ఆయనకు చెందిన బిక్స్(బిగిలోవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ స్టడీస్) సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పునర్జన్మ నిజమని నిరూపించే సాక్ష్యాలను, థియరీలను వ్యాసరూపంలో పంపాలని, వీటిలో ఫస్ట్ వచ్చిన రచనకు హాఫ్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో 3 కోట్ల 66 లక్షల పై చిలుకు), రెండు, మూడు స్థానాల్లో రచనలకు మిగిలిన హాఫ్ మిలియన్ డాలర్లు ఇస్తామని వివరించింది. మనిషి మరణానంతరం అతని చేతనను సజీవంగా ఉంచడం పై ప్రయోగాలకు ఈ సంస్థను రాబర్ట్ స్థాపించాడు. మరణానంతరం మనిషి చేతన కొనసాగేందుకు పునర్జన్మే మార్గమని, అయితే ఇది నిజమని నిరూపించాలని బిక్స్ తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలాంటి వింత పరిశోధనలకు లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచాడు. విశ్వంలో వేరే గ్రహాల్లో తెలివైన జీవులున్నాయా? యూఎఫ్ఓ (ఫ్లయింగ్ సాసర్లు) నిజమేనా? అనే అంశాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఆయన బోలెడు డాలర్ల పెట్టుబడి పెట్టడమే కాకుండా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిస్కవరీ సైన్స్, బిగలోవ్ ఏరోస్సేస్ స్టడీస్ అనే సంస్థలను కూడా నెలకొల్పాడు. అయితే ఈ ప్రశ్నలకు ఆయనకు ఏమి సమాధానాలు లభించాయో బయటకు చెప్పలేదు. తాజాగా పునర్జన్మల నిజాన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. తాను తన సొంతవాళ్లు మరణించినప్పుడు అనుభవించిన బాధ నుంచి ఈ ఆలోచన వచ్చిందని, మనం ప్రేమించిన వాళ్లు మననుంచి దూరమైనా ఇంకోచోట ఉంటారనే నిజాన్ని రాబట్టమే తన లక్ష్యమని రాబర్ట్ చెబుతున్నాడు. మరి ఈ యత్నంలో ఎలాంటి ఆన్సర్లు దొరుకుతాయో? కనీసం ఆయన పునర్జన్మ వివరాలైనా తెలుసుకోగలుగుతాడో? లేదో? వేచిచూడాల్సిందే! -
ఐరాసకు ఇది పునర్జన్మ: మోదీ
ఐక్య రాజ్య సమితి: కరోనా మహమ్మారి ఐక్య రాజ్య సమితి పునర్జన్మకు, పునర్నిర్మాణానికి అవసరమైన సందర్భాన్ని అందించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ భేటీలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఐరాస ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. మావన కేంద్రిత నాగరికత దిశగా సరికొత్త అడుగులను ఐరాస వేయాలంటూ ఆకాంక్షించారు. దేశాలు పెరుగుతున్న కొద్దీ సంస్థపై అంచనాలు కూడా పెరుగతున్నాయని అన్నారు. బహుదేశీయ విధానం ద్వారా ప్రపంచంలో సుస్థిరమైన శాంతి, అభివృద్ధి పెరుగుతాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మానవ లక్ష్యాలను అందుకునేలా 75వ యానివర్సరీకి ఐరాస తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. రెండవప్రపంచ యుద్ధం ఐరాస పునాదికి నాంది పలికిందని, కోవిడ్ మహమ్మారి ఐరాస పునర్నిర్మాణానికి పునాది కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలతో కలసి పని చేస్తున్నట్లు చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదాలతో పాటు భారతీయ వైద్య మూలాలతో నేడు ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా నుంచి కోలుకుంటున్న దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలను తెరిపించామని, భారీ స్థాయిలో ఆయుష్మాన్ భారత్ చేపట్టినట్లు గుర్తుచేశారు. 2022 నాటికి ప్రతి భారతీయుడు ఇల్లు కలిగి ఉండాలనేది తమ లక్ష్యమని చెప్పారు. -
‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’
లండన్: ప్రిన్సెస్ డయానా.. ఈ కాలం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ ఇరవై ఏళ్ల క్రితం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు. మామూలు సాధరణ కుటుంబంలో జన్మించి.. బ్రిటీష్ రాజకుంటుంబంలో కోడలిగా అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇందరి ప్రేమను పొందిన ఆమె మీద విధికి కన్ను కుట్టింది. దాంతో యాక్సిడెంట్ రూపంలో అర్థాంతరంగా డయానాను తనతో తీసుకెళ్లి.. కోట్ల మందిని కన్నీటి సంద్రంలో ముంచింది. చార్లెస్ ప్రిన్సెస్‌ను 1981లో వివాహం చేసుకుని రాజ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు డయానా. తరువాత 1997లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె మరణించారు. డయానా మరణించి నేటికి 20 ఏళ్లకు పైనే అయ్యింది. అయితే తాజాగా ఓ నాలుగేళ్ల ఆస్ట్రేలియా బాలుడు తాను గత జన్మలో ప్రిన్సెస్ డయానాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన టీవీ ప్రజెంటర్ డేవిడ్ క్యాంప్ బెల్ నాలుగేళ్ల కుమారుడు బిల్లీ క్యాంప్ బెల్ తానే ప్రిన్సెస్ డయానాను అంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అని చెబుతున్నాడు. ప్రిన్స్ విలయమ్, ప్రిన్స్ హ్యారీ తన పిల్లలంటున్నాడు. ఈ విషయం గురించి బిల్లీ తండ్రి డేవిడ్ క్యాంప్ బెల్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల వయసులో బిల్లీ తొలిసారి ఏదో కార్డు మీద డయానా ఫోటోను చూశాడు. అప్పుడే వచ్చిరాని భాషలో ఆ ఫోటోలో ఉన్నది నేనే.. ప్రిన్సెస్‌గా ఉన్నప్పుడు తీసిన ఫోటో అని చెప్పడం ప్రారంభించాడు’ అన్నాడు. ‘చిన్నతనం కదా.. అందుకే అలా మాట్లాడుతున్నాడని భావించాం. కానీ బిల్లీ పెరుగుతున్న కొద్ది.. డయానా జీవితానికి సంబంధించిన విషయాలు.. చార్లెస్‌తో గడిపిన రోజుల గురించి చెప్పేవాడు. కేవలం నాలుగేళ్ల వయసున్న బిల్లీకి.. డయానా గురించి తెలిసే అవకాశం లేదు. అయినా కూడా అతని వ్యాఖ్యలకు మేం పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. కానీ కొద్ది రోజుల క్రితం బిల్లీ మరో ఆసక్తికర, నమ్మలేని విషయం గురించి చెప్పాడు. డయానాకు జాన్ అనే సోదరుడు ఉన్నాడని.. కానీ పుట్టిన కొద్ది గంటల్లోనే అతను చనిపోయాడని తెలిపాడు. దాంతో నా కుమారుడి మాటలు నమ్మాల్సి వస్తోంది’ అంటున్నాడు డేవిడ్. -
నా పేరు లుగ్డీదేవి... మా ఆయన పేరు కేదార్నాథ్
శాంతిదేవి 1926 డిసెంబర్లో ఢిల్లీలో పుట్టింది. 1930లో అంటే నాలుగేళ్ల వయసు నుంచి తన గతజన్మ విషయాలను చెప్పడం మొదలుపెట్టింది. మహాత్మాగాంధీ సైతం ఈ కేస్ పట్ల శ్రద్ధ తీసుకొని శోధించమని కమిషన్‌కు సిఫారస్ చేశారు. 1936లో కమిషన్ రిపోర్ట్ ఆధారంగా బాల్చంద్ నహతా అనే వ్యక్తి ‘పునర్జన్మ కీS పర్యాలోచన’ అనే పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో విదేశాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు శాంతిదేవిని ఇంటర్వూ్య చేశారు. పత్రికలలో ప్రముఖంగా వ్యాసాలు రాశారు. ఆమె కథనం ఇలా ఉంది.. శాంతిదేవి నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో ‘నా సొంత ఇల్లు మధురలో ఉంది..’ అని చెబుతుండేది. తల్లితండ్రులు మొదట్లో ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆరేళ్ల వయసులో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి మధురకు చేరుకుంది. ఎలాగో తంటాలు పడి ఆమెను వెతుక్కొచ్చారు తల్లీతండ్రి. స్కూల్‌కి వెళితే టీచర్లు, ప్రిన్సిపల్‌తో ‘మధురలోని ఓ ప్రాంతానికి చెందిన మాండలికంలో మాట్లాడేది శాంతిదేవి. తన భర్త కేదార్నాథ్ అని, అతను ఒక చిన్న వ్యాపారి అని, తన పేరు లుగ్డీదేవి అని, తొమ్మిదేళ్ల క్రితం తనకు ఓ కొడుకు పుట్టాడని, వాడు పుట్టిన పది రోజులకు జబ్బు చేసి తను మరణించానని చెప్పింది. వాళ్లు ఆమె చెప్పిన అడ్రెస్‌కు ఈ విషయం తెలియజేశారు. కేదార్నాథ్ ఢిల్లీ వచ్చారు. అతనితో పాటు ఉన్న కొడుకును శాంతిదేవి వెంటనే గుర్తుపట్టింది. కేదార్నాథ్ భార్యగా ఉన్నప్పుడు తను ఏమేం పనులు చేసేది వివరించింది. కమిషన్ సభ్యులు ఆ తర్వాత శాంతిదేవిని తీసుకొని మధుర వెళ్లారు. అక్కడ లుగ్డీదేవి తాతతో సహా చాలా కుటుంబాలను గుర్తించింది. వారి యోగక్షేమాలు అడిగింది. మరణశయ్య మీద ఉన్న తనకు కేదార్నాథ్ ఎన్నో ప్రమాణాలు చేశాడని, అవన్నీ అతను నిర్లక్ష్యం చేశాడని చెప్పింది. చనిపోవడానికి కొన్ని రోజులు ముందు తను భూమిలో దాచిన డబ్బును తవ్వి తీసుకొచ్చి ఇచ్చింది. తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. కమిషన్ సభ్యులు శాంతిదేవికి ఇది ‘పునర్జన్మ ’అని రిపోర్ట్ ఇచ్చారు. శాంతిదేవి యుక్తవయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. 1950లో అమెరికన్ సైకాలజిస్ట్ ‘ఐయాన్ స్టీవెన్సన్ శాంతిదేవి విషయం తెలుసుకొని ఇంటర్వూ్య చేయడంతో ఆమె పునర్జన్మ కథ ప్రపంచవ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 3000 మంది గతజన్మ అనుభవాల మీద పరిశోధనలు చేసిన స్టీవెన్‌సన్‌కి మరణానికి ముందు లుగ్డీదేవి అనుభవించిన కష్టం, శాంతిదేవి చెప్పిన విషయాలు ఒకేలా ఉండటం ఆశ్చర్యపరిచాయి. 1987 డిసెంబర్ 27న ఆమె చనిపోవడానికి నాలుగు రోజులు ముందు శాంతిదేవిని కలిసి, ఇంటర్వూ్య చేసిన కె.ఎస్.రావత్ ఆమె కథనాన్ని తిరిగి ప్రచురించారు. -
అవయవదానంతో పునర్జన్మ
సాక్షి, చెన్నై : ఓ యువకుడి అవయవాలు శుక్రవారం చెన్నైలో పలువురికి పునర్జన్మనిచ్చాయి. అతని గుండెను కోయంబత్తూరు నుంచి విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. కిడ్నీ, కళ్లు, కాలేయం తదితర అవయవాలను అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి పలువురి రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అవయవ దానాలపై రోజురోజుకూ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. తమ అవయవాల్ని దానం చేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకువస్తున్నారు. అదే సమయం లో ప్రమాద రూపంలో ఎదురయ్యే బ్రెయిన్ డెట్ కేసుల్లో తమ వాళ్ల అవయవాల దానానికి తల్లిదండ్రులు, బంధువులు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం మెడికల్ హబ్ నగరం చెన్నైకు అవయవాల్ని తీ సుకొచ్చి రోగులకు శస్త్ర చికిత్సతో పునర్జన్మనిచ్చే పనిలో వైద్య నిపుణులు నిమగ్నమయ్యూరు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజ్ ప్రమాదం రూపంలో బ్రెయిన్ డెట్ కావడంతో అతడి అవయవాలు పలువురు రోగులకు పునర్జన్మనిచ్చాయి. అవయవ దానం: తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజు (26) గత వారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తిరుప్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చికిత్సలు అందించారు. ఆపై కోయంబత్తూరులోని కుప్పుస్వామి నా యుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు బ్రెయిన్‌డెట్ కావడంతో అవయవాల దానానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. అవయవ దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూ స్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అక్కడి వైద్యులు అందుకు తగ్గ శస్త్ర చికిత్సలకు ఏర్పా టు చేశారు. శుక్రవారం వేకువ జామున మోహన్‌రాజ్ అవయవాల్ని తొలగించారు. అన్నింటినీ ఫ్రీజర్‌లో ఉంచారు. గుండెను ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. ముందుగా చేసుకున్న ఏర్పాట్ల మేరకు త్వరితగతిన హృదయాన్ని నగరంలోని మలర్ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఓ రోగికి శస్త్ర చికిత్స నిర్వహించి గుండె మార్పిడి చేశారు. అలాగే, మోహన్‌రాజ్ కళ్లు, కిడ్నీ, కాలేయం తదితర అవయవాలు పలు ఆస్పత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. కళ్లను శంకర నేత్రాలయూనికి అప్పగించారు. -
తెలంగాణ పునర్జన్మనిచ్చింది
కామారెడ్డి, న్యూస్‌లైన్: తాను పుట్టిందెక్కడైనా తనకు పునర్జన్మనిచ్చింది తెలంగాణేనని జనసేన నేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గద్దరన్న స్పీచ్, సాయుధ రైతాంగ పోరాటం వంటివి తనకు ఎంతో ఇష్టమన్నారు. తనకు కేసీఆర్, ఆయన కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవని స్పష్టం చేశారు. నన్ను కేసీఆర్ తిట్టినా గౌరవిస్తానన్నా రు. ఎందుకు తిట్టించుకుంటావని తన తల్లి అడిగిందని, తెలంగాణ కోసం చనిపోయిన 11 వందల మంది తల్లుల కడుపుకోత గురించి అంటూ సమాధానంగా చెప్పానని పవన్ కళ్యాణ్ తెలి పారు. సభలో ‘షబ్బీర్‌కో హఠావో.. కామారెడ్డికో బచావో’ అంటూ పవన్ కళ్యాణ్ నినాదాన్నిచ్చారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యా లో గంప గోవర్ధన్‌ను నిలదీయాలన్నారు. సభలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్లా బీజేపీ అభ్యర్థులు డాక్టర్ సిద్దిరాములు, బాణాల లక్ష్మారెడ్డి, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. సభ ముగిసిన అనంతరం ఏటీసీ నుంచి సిగ్న ల్స్ రాకపోవడంతో అరగంటపాటు అక్కడే నిలిచిపోయింది. పవన్‌కళ్యాన్ హెలికాప్టర్లోనే ఉన్నాడని తెలిసిన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. హెలికాప్టర్ వద్దకు పరుగులు తీయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అభిమానులు పరుగులు తీయాల్సి వచ్చింది. హెలికాప్టర్లో కూర్చున్న పవన్ కళ్యాన్ భోజనం చేశారు.