తాను పుట్టిందెక్కడైనా తనకు పునర్జన్మనిచ్చింది తెలంగాణేనని జనసేన నేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ అన్నారు.
కామారెడ్డి, న్యూస్‌లైన్: తాను పుట్టిందెక్కడైనా తనకు పునర్జన్మనిచ్చింది తెలంగాణేనని జనసేన నేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గద్దరన్న స్పీచ్, సాయుధ రైతాంగ పోరాటం వంటివి తనకు ఎంతో ఇష్టమన్నారు. తనకు కేసీఆర్, ఆయన కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విభేదాల్లేవని స్పష్టం చేశారు. నన్ను కేసీఆర్ తిట్టినా గౌరవిస్తానన్నా రు. ఎందుకు తిట్టించుకుంటావని తన తల్లి అడిగిందని, తెలంగాణ కోసం చనిపోయిన 11 వందల మంది తల్లుల కడుపుకోత గురించి అంటూ సమాధానంగా చెప్పానని పవన్ కళ్యాణ్ తెలి పారు.
సభలో ‘షబ్బీర్‌కో హఠావో.. కామారెడ్డికో బచావో’ అంటూ పవన్ కళ్యాణ్ నినాదాన్నిచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటెయ్యా లో గంప గోవర్ధన్‌ను నిలదీయాలన్నారు. సభలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్లా బీజేపీ అభ్యర్థులు డాక్టర్ సిద్దిరాములు, బాణాల లక్ష్మారెడ్డి, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. సభ ముగిసిన అనంతరం ఏటీసీ నుంచి సిగ్న ల్స్ రాకపోవడంతో అరగంటపాటు అక్కడే నిలిచిపోయింది. పవన్‌కళ్యాన్ హెలికాప్టర్‌లోనే ఉన్నాడని తెలిసిన అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. హెలికాప్టర్ వద్దకు పరుగులు తీయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అభిమానులు పరుగులు తీయాల్సి వచ్చింది. హెలికాప్టర్‌లో కూర్చున్న పవన్ కళ్యాన్ భోజనం చేశారు.