Sai Pallavi Believes In Reincarnation And Here Is How: సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'వచ్చిండే మెల మెల్లగా వచ్చిండే', 'దాని కుడి భుజం మీద కడవ' పాటలకు సాయి పల్లవి చేసిన డ్యాన్స్‌తో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తన నాట్యం, హావాభావాలతో ఆ పాటలకు మరింత పేరు వచ్చింది. దక్షిణాది టాప్ హీరోయిన‍్లలో ఒకరిగా సాయి పల్లవి కొనసాగుతోంది. ప్రస్తుతం నానికి జంటగా సాయి పల్లవి నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి, మడొన్నా సెబాస్టియన్‌లు కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రం పునర్జన్మ, బెంగాల్ నేపథ్యంతో తెరకెక్కింది.
ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్
శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి సాయి పల్లవి 'నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మేము మా పాత్రల గురించి, వాటిని ఇంకా బాగా ఎలా పోషించాలి అనే మాట్లాడుకునేవాళ్లం. ఎడిట్ చేసిన తర్వాత కూడా సీన్లను పరిశీలించి నోట్స్ షేర్ చేసుకునేవాళ్లం.' అని చెప్పింది. అలాగే పునర్జన్మను నమ్ముతారా అని సాయి పల్లవిని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది. 'అప్పుడప్పడు నేను ఒక యువరాణిని అనే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను ఆరు, ఏడు తరగతుల్లో ఉన్నప్పుడు ఈజిప్ట్ యువరాణులు, క్వీన్ నెఫెర్టిటి గురించి ఎక్కువగా చదివాను. నా గత జన్మలో నేను కచ్చితంగా యువరాణి అయి ఉంటా అని అనిపించింది నాకు. నేను పునర్జన్మను నమ్ముతాను.' అని మనసులోని మాటను బయటపెట్టింది సాయి పల్లవి.
ఇదీ చదవండి: స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే
శ్యామ్ సింగరాయ్ సినిమా కథ రెండు విభిన్న కాలక్రమాల్లో జరుగుతుందని సమాచారం. ఒకటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటే మరొకటి హైదరాబాద్‌లో ఉంటుంది. 'నేను 1960 కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథలో దేవదాసి పాత్రను పోషించాను. వ్యక్తిగతంగా ఇలాంటి మిస్టీరియస్ టైమ్ జోన్ చిత్రాల్లో నటించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆ కాలం నాటి సెట్స్‌లో ఉండటం, ఆనాటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను చాలా మంది బాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందులో నాకు మొదటగా గుర్తు వచ్చేది సంజయ్ లీలా బన్సాలీ. ఆయన సినిమాలు చూశాను. బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుందో నాకు తెలియదు. స్క్రిప్ట్‌కు తగినట్లుగా ఉంటేనే సినిమా ఒప్పుకుంటాను.' అని సాయి పల్లవి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment