అవయవదానంతో పునర్జన్మ | organ donation with Reincarnation | Sakshi
Sakshi News home page

అవయవదానంతో పునర్జన్మ

Published Sat, Jan 3 2015 2:17 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

organ donation with Reincarnation

సాక్షి, చెన్నై : ఓ యువకుడి అవయవాలు శుక్రవారం చెన్నైలో పలువురికి పునర్జన్మనిచ్చాయి. అతని గుండెను కోయంబత్తూరు నుంచి విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. కిడ్నీ, కళ్లు, కాలేయం తదితర అవయవాలను అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి పలువురి రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అవయవ దానాలపై రోజురోజుకూ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. తమ అవయవాల్ని దానం చేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకువస్తున్నారు.

అదే సమయం లో ప్రమాద రూపంలో ఎదురయ్యే బ్రెయిన్ డెట్ కేసుల్లో తమ వాళ్ల అవయవాల దానానికి తల్లిదండ్రులు, బంధువులు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం మెడికల్ హబ్ నగరం చెన్నైకు అవయవాల్ని తీ సుకొచ్చి రోగులకు శస్త్ర చికిత్సతో పునర్జన్మనిచ్చే పనిలో వైద్య నిపుణులు నిమగ్నమయ్యూరు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజ్ ప్రమాదం రూపంలో బ్రెయిన్ డెట్ కావడంతో అతడి అవయవాలు పలువురు రోగులకు పునర్జన్మనిచ్చాయి.
 
అవయవ దానం: తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజు (26) గత వారం రోడ్డు ప్రమాదంలో  గాయపడ్డాడు. తిరుప్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చికిత్సలు అందించారు. ఆపై కోయంబత్తూరులోని కుప్పుస్వామి నా యుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు బ్రెయిన్‌డెట్ కావడంతో అవయవాల దానానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. అవయవ దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూ స్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అక్కడి వైద్యులు అందుకు తగ్గ శస్త్ర చికిత్సలకు ఏర్పా టు చేశారు.

శుక్రవారం వేకువ జామున మోహన్‌రాజ్ అవయవాల్ని తొలగించారు. అన్నింటినీ ఫ్రీజర్‌లో ఉంచారు. గుండెను ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. ముందుగా చేసుకున్న ఏర్పాట్ల మేరకు త్వరితగతిన హృదయాన్ని నగరంలోని మలర్ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఓ రోగికి శస్త్ర చికిత్స నిర్వహించి గుండె మార్పిడి చేశారు. అలాగే, మోహన్‌రాజ్ కళ్లు, కిడ్నీ, కాలేయం తదితర అవయవాలు పలు ఆస్పత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. కళ్లను శంకర నేత్రాలయూనికి అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement