Surgical treatments
-
ఉస్మానియాలో అరుదైన శస్త్ర చికిత్సలు
అఫ్జల్‌గంజ్: నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇద్దరు చిన్నారులకు అరుదైన శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలాజి హెచ్‌వోడి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం వివరాలు వెల్లడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా, షాద్‌నగర్‌కు చెందిన తేజస్విని (11 నెలలు) ఆడుకుంటుండగా బటన్ బ్యాటరీ నోట్లో పెట్టుకుని మింగేసింది. దీంతో ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన పాప తల్లి సరస్వతి చిన్నారని వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా గ్యాస్ట్రోఎంట్రాలాజి వైద్యులు గంటపాటు శ్రమించి ప్రత్యేక చికిత్స ద్వారా గొంతులో ఇరుక్కున్న బ్యాటరీని ఎండోస్కోపిక్ రిమువల్ బాటరి ఇన్ ద్వారా తొలగించారు. అలాగే నగరంలోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన అలిజ (4) ఈ నెల 3న రూ.2 నాణెంతో ఆడుకుంటూ నోటిలో పెట్టుకొని మింగింది. దీనిని గమనించిన ఆమె తండ్రి మహ్మద్ ఇంతియాజు బాలికను కింగ్‌కోఠిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు పరీక్షలు చేసి ఎండోస్కోపిక్ రిమువల్ ఇన్ టూ రూపీస్ చికిత్స చేసి రెండు నాణేన్ని బయటికి తీశారు. వైద్య బృందంలో హెచ్‌వోడి రమేష్‌తో పాటు ఇతర వైద్యులు, అనస్తీషియా వైద్యులు పాల్గొన్నారు. వీరిని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేందర్ అభినందించారు. -
మల్కాపూర్‌లో కంటి వెలుగుకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు, శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు ఉద్దేశించిన కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పంద్రాగస్టు రోజైన బుధవారం మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కంటి చూపు సమస్యలతో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడాలనే సదుద్దేశంతో ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఐదు నెలల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయితీల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు 812 వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామాల్లో, వార్డును యూనిట్‌గా తీసుకుని పట్టణాల్లో కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. వైద్య బృందాలు మరింత నాణ్యమైన పని విధానాన్ని కనబరిచేందుకు వారానికి 2 రోజులు వారాంతపు సెలవులు ఇవ్వాలన్నారు. -
సర్జరీల్లో ఘనాపాఠి!
ధనార్జనే ధ్యేయంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవృత్తిని దైవంగా భావించి పేదల పాలిట వైద్య నారాయణుడిగా మారారు ఆయన. తండ్రి చూపిన సేవా మార్గంలో పయనిస్తూ వేలాది శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఆయన. ప్రభుత్వ దవాఖానాలపై విశ్వాసం కలిగేలా విధులు నిర్వర్తిస్తూ.. గడిచిన ఆరున్నరేళ్లలో 13,139 శస్త్ర చికిత్సలు చేశారు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ప్లాస్టిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ నాగప్రసాద్. అఫ్జల్‌గంజ్ : నాగప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం. తండ్రి కృష్ణమూర్తి చీఫ్ ఇంజినీర్. తల్లి పుష్పలత. వీరి కుటుంబం హైదరబాద్‌లో స్థిరపడింది. కృష్ణమూర్తి దంపతులకు నాగప్రసాద్, శ్రీనివాస్ ఇద్దరు కుమారులు. నాగప్రసాద్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాగప్రసాద్ 1994లో సూపర్ స్పెషలిటీ (ప్లాస్టిక్ సర్జన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1997లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2004లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మూడేళ్లు పని చేసి 300 శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం బదిలీపై నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి వచ్చారు. 2012 నుంచి ఇప్పటివరకు 13,139 శస్త్ర చికిత్సలు చేశారు. ప్రతి ఏటా వెయ్యికిపైగా శస్త్ర చికిత్సలు చేసి పేదోల పాలిట ప్రాణదాతగా నిలుస్తురు. ఉస్మానియాలోనూ కార్పొరేట్ వైద్యం.. పేదోలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కార్పొరేట్ స్థాయిలో ఉస్మానియా ఆస్పత్రిలోనూ వైద్యం అందుతోంది. పేదవాళ్లు డబ్బులు వృథా చేసుకోకుండా ఉస్మానియాలో అవసరమైన శస్త్ర చికిత్సలు చేసుకోవాలి. – డాక్టర్ నాగప్రసాద్ -
బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. బ్లడ్ గ్రూప్ వేరైనా కిడ్నీ మార్పిడిని విజయవంతంగా చేశారు. ‘బి’పాజిటివ్ బ్లడ్‌గ్రూప్ స్వీకర్తకు ‘ఎ’పాజిటివ్ దాత కిడ్నీని ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్’పద్ధతిలో వైద్యులు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను నెఫ్రాలజీ వైద్యనిపుణుడు డాక్టర్ విక్రాంత్‌రెడ్డి వెల్లడించారు. అస్సాంకు చెందిన నిలాధన్ సింఘా(42) కిడ్నీ సంబంధిత సమస్యతో కేర్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. క్రియాటిన్ 16.0 గా నమోదైంది. యాంటీబాడీస్ బాగా తగ్గిపోవడంతో కిడ్నీ మార్పిడి అనివార్యమైంది. స్వీకర్త బ్లడ్ గ్రూప్‌నకు సంబంధించిన దాతలెవరూ కిడ్నీ దానానికి ముందుకు రాలేదు. చివరకు ఆయన భార్య లువాంగ్ సింఘా(37) కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, స్వీకర్త బ్లడ్‌గ్రూప్ ‘బి’పాజిటివ్ కాగా, దాతది ‘ఎ’పాజిటివ్. సాధారణంగా రెండు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్సలు చేయరు. ఒకవేళ చేసినా స్వీకర్త శరీరం దాత అవయవాన్ని తిరస్కరిస్తుంది. చికిత్సకు మరోదారి లేకపోవడంతో వైద్యులు ఏప్రిల్ మొదటివారంలో ‘ఏబీవో ఇన్‌కాంపిటెబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’పద్థతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. -
నేటి నుంచి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆదివారం సరోజినీ ఆస్పత్రిలో అవేర్నెస్ వాక్ని ప్రారంభించనున్నారు. గ్లకోమా (నీటి కాసులు) వ్యాధిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ఈ వాక్ని నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా గ్లకోమా సంక్రమిస్తుంది. త్వరగా గుర్తిస్తే వైద్య చికిత్స అందించవచ్చు. గ్లకోమాతో కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మూడు శాతం మంది గ్లకోమా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. మన దేశంలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. ఆ మేరకు ప్రపంచంలోని గ్లకోమా వ్యాధిగ్రస్తుల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. సరోజినీలో ఏటా 10 వేల మందికి వైద్యం సరోజినీ దేవి ఆస్పత్రి ఏటా 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తోంది. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం, వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం, క్రమం తప్పకుండా చికిత్స చేయించుకుంటే గ్లకోమా నుంచి తప్పించుకోవచ్చు. సరోజినీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజా చైతన్యం, ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, స్లోగన్స్, పోస్టర్ల పోటీ నిర్వహిస్తు న్నారు. ఈ వారం రోజులు గ్లకోమా నిర్ధారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాల్ని వినియోగం చేసుకోవాలని కోరారు. -
గాడితప్పుతున్న ఆరోగ్యశ్రీ!
సాక్షి, హైదరాబాద్: దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ గాడితప్పుతోంది. పథకంపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడుతోంది. పూర్తిస్థాయి ఉన్నతాధికారి లేకపోవడం, ఇతర సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తుండటంతో సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కలసి పలువురు అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి పరిశీలనలోనూ ఇవే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైద్య శాఖ పనితీరు, కేంద్ర పథకాల అమలును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్.. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించి వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇన్చార్జి సీఈవో కె.మనోహర్ ఇచ్చిన నివేదికపై ప్రీతి అనేక సందేహాలు వ్యక్తం చేశారు. రోగులకు అవసరం లేకున్నా శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని, నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రస్టు సీఈవో చెప్పగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో లోపాలు సరిదిద్దాలని సూచించారు. -
ఉచిత శస్త్ర చికిత్సలు వైఎస్సార్ చలువే
కర్నూలు (హాస్పిటల్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్లే 80 శాతం చిన్నపిల్లల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయగలుగుతున్నామని, తద్వారా వేలాది మంది చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో ఏపీ పీడియాట్రిక్ సర్జన్స్ సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కె.రమేష్‌రెడ్డి మాట్లాడుతూ..వేలాది రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించుకోలేని పేదలకు ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ పథకం వల్ల పీడియాట్రిక్ సర్జరీ విభాగాలు కూడా అభివృద్ధి చెందాయన్నారు. ఇలాంటి విభాగాలకు పీజీ వైద్యులు వెన్నెముకగా ఉంటారన్నారు. సదస్సులో ఏపీ పీడియాట్రిక్ సర్జన్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ చంద్రభాస్కర్రావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోశాధికారిగా డాక్టర్ రవికుమార్‌ను ఎన్నుకున్నారు. -
అందమా...అందుమా!
రూపం...శరీరాకృతి మార్పులకు ఆరాటం యువతలో వింత పోకడ సమాజంలో విపరీత ధోరణులు వికటిస్తున్న శస్త్ర చికిత్సలు రేఖ కాస్త నల్లగా ఉంటుంది. తాను తెల్లగా లేనని... స్నేహితుల్లో ప్రత్యేక గుర్తింపు రావడం లేదని తన లో తాను కుమిలి పోయేది. ఓ రోజు టీవీలో వచ్చిన ‘తెల్లగా మార్చబడును’ అనే ప్రకటన ఆమెను ఆకర్షించింది. రూ.రెండు లక్షలు వెచ్చించి... ఆ సంస్థ చెప్పిన లేపనాలు ముఖానికి పూసుకుంది. తెల్లగా కావడానికి బదులు మరింత అందవికారంగా తయారైంది. శేఖర్ పొడవు ఐదడుగులు. తన స్నేహితుల కంటే పొట్టిగా ఉన్నానని... శరీరాకృతి సిక్స్‌ప్యాక్‌లో లేదని నిత్యం బాధపడేవాడు. తాను కోరుకున్నట్టుగా శరీరాకృతిని మారుస్తామన్న ఓ ఆస్పత్రి ప్రకటనను నమ్మాడు. రూ.లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రిలో చేరాడు. తాను కోరుకున్నట్టు జరుగలేదు సరికదా... కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చి పడ్డాయి. అందం... ఆకృతి కోసం ఆరాట పడుతున్న ఇలాంటి వారి సంఖ్య నగరంలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సిటీబ్యూరో: ఆరడుగుల పొడ వు... సిక్స్ ప్యాక్ బాడీ...పొడవైన ముక్కు... తెల్లటి రంగు... ఇలా బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యమిస్తున్న గ్రేటర్ యువత సర్జరీల పేరిట తమను తాము శిక్షించుకుంటున్నారు. దీనిపై సామాజిక శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రేటర్లో ఇలాంటి విపరీత ధోరణులు పెరుగుతున్న తీరు విస్తుగొల్పుతోందని చెబుతున్నారు. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఆర్థికంగా పెనుభారం కావడంతో పాటు.. కుటుంబ సభ్యులకు తీరని బాధనుమిగులుస్తున్నాయని పేర్కొంటున్నారు. తాజాగా గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎత్తు పెరిగేందుకు చేయించుకున్న సర్జరీ సంచలనం సృష్టించిన విషయం విదితమే. ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న శరీర భాగాలను బాగు చేసుకునేందుకు అత్యవసరమైతే శస్త్ర చికిత్సలు చేయించుకోవడం తప్పు కాదు. అందం కోసం అర్రులు చాస్తూ.. ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్న ధోరణి సరికాదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాము ప్రస్తుతం ఉన్న స్థితిని అంగీకరించకపోవడం (సెల్ఫ్ యాక్సెప్టెన్స్) వంటి ధోరణితో ఇలాంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు. కౌన్సెలింగ్‌తో మేలు అందంగా ఉన్న వారితో పోల్చుకొని తమలో తాము మథన పడుతూ..సెల్ఫ్ ఇమేజ్ను మార్చుకునేందుకు కొందరు యు వతీ యువకులు ఆరాట పడుతున్నారు. ఇలాంటి వారు శస్త్రచి కిత్సలకు వెనుకాడడం లేదు. వీరిలో ఆత్మవిశ్వాసం పెంచడం, ప్రస్తుతం తాము ఎలా ఉన్నారో అలాగే తమను తా ము అంగీకరించుకునేందుకు కౌన్సెలింగ్ చేస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనలు, సినిమాల ప్రభావంతో ఎత్తుగా, తెల్లగా ఉన్నవారే సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారన్న సందేశం యువతలో బలంగా నాటుకుపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ పెడధోరణిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు తరచూ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. - వీరేందర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు గుణం కంటే అందానికే ప్రాధాన్యం ఇటీవల అమ్మాయిలు.. అబ్బాయిలు గుణం కంటే అందానికే ప్రాధాన్యమిస్తున్నారు. తెల్లగా, ఎత్తుగా ఉండడం వంటి భౌతిక అంశాలతో సా మాజిక హోదా పెరుగుతుందన్న భావన ప్రబలుతోంది. ఈ ధోరణి సమాజానికి మంచిది కాదు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి భావాలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులు కూడా అందం కంటే వ్యక్తుల గుణం, నడవడి, సత్ప్రవర్తన వంటి అంశాలకే ప్రాధాన్యమివ్వాలి. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే మిన్న అన్న భావన పెంపొందాలి. - ఆదిరాజు కృష్ణమోహన్‌రావు, సామాజికవేత్త మనిషిగా గుర్తించే సంస్కృతి పెరగాలి కుటుంబ, విద్యా వ్యవస్థల్లో మనిషిని మనిషిగా గుర్తించే సంస్కృతిని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటి పెడధోరణులు తగ్గుతాయి. అందం, డబ్బు, టెక్నాలజీ, హోదాలకు పెద్ద పీటవేయడం సరికాదు. పొట్టి వాళ్లయినా విజయం సాధించవచ్చు...అందంగా లేకపోయినా మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవచ్చని యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. - ఆకెళ్లపాటి రాఘవేంద్ర, కెరీర్ గెడైన్స్ నిపుణులు -
ఆరోగ్యశ్రీ.. ప్రైవేటుకు సిరి
ఐదేళ్లలో 9,03,961 శస్త్ర చికిత్సలు రూ.2,604.15 కోట్ల ఖర్చు {పభుత్వ ఆస్పత్రుల వెనుకబాటు నిజామాబాద్: పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కాసులవర్షం కురిపిస్తోంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని కార్పొరేట్ వసతులతో అందించాలన్న దృఢసంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆయ న అకాల మరణం తర్వాత అభాసుపాలవుతోంది. పేద రోగులకు అండగా నిలిచి ప్రాణాలను కాపాడిన అపరసంజీవని ఆరోగ్యశ్రీ ఐదేళ్లుగా ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులకు వరంగా, పేద రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ శాఖలు నిద్రావస్థలో ఉండటంతో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా పేదల వాటాను దోపిడీ చేస్తున్నాయి. ఇంకోపక్క రిఫరల్ ఆస్పత్రుల్లోని ఆరోగ్యశ్రీ వార్డుల్లో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిరంతరం పర్యవేక్షించాల్సిన విజిలెన్స్ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో పేద రోగుల శస్త్ర చికిత్సలు విఫలం కావడం, నిధులన్నీ ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులకు ధారాదత్తం అవుతున్నాయి. ‘ప్రైవేట్’కే కాసుల వర్షం.. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో 183 ప్రైవేట్ ఆస్పత్రులు రిఫరల్ ఆస్పత్రులుగా కొనసాగుతున్నాయి. 2011-12 నుంచి 2015-16 వర కు రాష్ట్రంలో మొత్తం 9,03,961 శస్త్త్రచ్రికిత్సలు జరుగగా మొత్తం రూ. 2,604.15 కోట్లు ఖర్చుచేశారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులతో పోలి స్తే ప్రైవేట్ ఆస్పత్రులకే కాసుల వర్షం కురిసిం ది. గడిచిన ఐదేళ్లలో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రుల్లో 5,89,135 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 1,841.91 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,14,826 శాస్త్ర చికిత్సలు జరగగా రూ.762.24 కోట్లు చెల్లించారు. జిల్లా పరంగా చూస్తే అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రుల్లో 1,05,528 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 263.31 కోట్లు ఈ ఐదేళ్లలో ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 35,000 శస్త్ర చికిత్సలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరగగా రూ. 92.24 కోట్లు చెల్లించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన శస్త్ర చికిత్సల పరంగా చూస్తే హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ గడిచిన ఐదేళ్లలో 58,727 శస్త్ర చికిత్సలు జరగగా రూ. 132.61 కోట్లు చెల్లించారు. నిబంధనలు బేఖాతరు.. రాష్ట్రంలో మొత్తం 183 ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్నా యి. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 56 రిఫరల్ ఆస్పత్రులు ఉండగా.. ఆదిలాబాద్‌లో ఒక్క ఆస్పత్రి మాత్రమే ఉంది. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఇందులో చాలా ఆస్పత్రులు డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)లు రూపొందించిన మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ పేద ప్రజలకు నామమాత్రపు సేవ ల్ని అందిస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే ఆరోగ్య శ్రీ నిధులను ఠంచనుగా రాబడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో 50 పడకలు తక్కువ కాకుండా ఉండాలి. కానీ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కేంద్రాలలో గల 65 రిఫరల్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సింహభాగం ఆస్పత్రుల్లో కనీసం 25 పడకలు కూడా లేవు. అలాగే తొమ్మిది జిల్లాల్లోని రిఫరల్ ఆస్పత్రుల పరిధిలో కొన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు, ల్యాబ్ సేవలు అందుబాటులో లేవు. కొన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్, నెఫ్రా లజీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, పాలిట్రామా, గ్యాస్టోఎంట్రారాలజీ వంటి నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. ప్రతి మూడు నెలలకోకసారి ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఆడిట్ రిపోర్టు కొన్ని జిల్లాల్లో సరిగా అందడం లేదు. జిల్లా వైద్యాధికారులు ప్రతినెలా ఆయా ఆస్పత్రులను విధిగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వాటిని రిఫరల్ జాబితా నుంచి తొలగించాలి. కానీ, ఐదేళ్లుగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో పడకలను బట్టి పేదలకు అందించాల్సిన వైద్యసేవలపై స్పష్టమైన రిజిస్టర్లు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా ఆరోగ్య శిబిరాలు.. ప్రైవేట్ రిఫరల్ ఆస్పత్రులు నెలకు రెండు ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వహించాలి. 2015-16లో రాష్ట్రంలోని ఏ ప్రైవేటు ఆస్పత్రి కూడా ఆరోగ్య శిబిరాల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో 56 రిఫరల్ ఆస్పత్రులున్నా ఇప్పటి వరకు కేవలం 34 ఆరోగ్య శిబిరాలు మాత్రమే నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో 9 రిఫరల్ ఆస్పత్రులు 32 శిబిరాలు, కరీంనగర్లో 17 రిఫరల్ ఆస్పత్రులు 34 శిబిరాలు, వరంగల్ జిల్లాలో 26 రిఫరల్ ఆస్పత్రులు కేవలం 55 ఆరోగ్యశిబిరాలు నిర్వహించడం గమనార్హం. ఆదిలాబాద్‌లో కేవలం ఒక రిఫరల్ ఆస్పత్రి ఉన్నా ఇప్పటి వరకు 70 ఆరోగ్య శిబిరాలు నిర్వహించింది. పట్టించుకున్నవారు లేరు కడుపులో రాళ్ల తొలగింపు ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాను. వారం రోజుల నుంచి నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. డాక్టర్లు వస్తారు..చూస్తారంటూ చెబుతున్నారే తప్ప.. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు. -భూదేవి, జాడీ గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా -
అవయవదానంతో పునర్జన్మ
సాక్షి, చెన్నై : ఓ యువకుడి అవయవాలు శుక్రవారం చెన్నైలో పలువురికి పునర్జన్మనిచ్చాయి. అతని గుండెను కోయంబత్తూరు నుంచి విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. కిడ్నీ, కళ్లు, కాలేయం తదితర అవయవాలను అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చి పలువురి రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అవయవ దానాలపై రోజురోజుకూ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. తమ అవయవాల్ని దానం చేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకువస్తున్నారు. అదే సమయం లో ప్రమాద రూపంలో ఎదురయ్యే బ్రెయిన్ డెట్ కేసుల్లో తమ వాళ్ల అవయవాల దానానికి తల్లిదండ్రులు, బంధువులు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం మెడికల్ హబ్ నగరం చెన్నైకు అవయవాల్ని తీ సుకొచ్చి రోగులకు శస్త్ర చికిత్సతో పునర్జన్మనిచ్చే పనిలో వైద్య నిపుణులు నిమగ్నమయ్యూరు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజ్ ప్రమాదం రూపంలో బ్రెయిన్ డెట్ కావడంతో అతడి అవయవాలు పలువురు రోగులకు పునర్జన్మనిచ్చాయి. అవయవ దానం: తిరుప్పూర్‌కు చెందిన మోహన్‌రాజు (26) గత వారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తిరుప్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత చికిత్సలు అందించారు. ఆపై కోయంబత్తూరులోని కుప్పుస్వామి నా యుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు బ్రెయిన్‌డెట్ కావడంతో అవయవాల దానానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. అవయవ దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూ స్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అక్కడి వైద్యులు అందుకు తగ్గ శస్త్ర చికిత్సలకు ఏర్పా టు చేశారు. శుక్రవారం వేకువ జామున మోహన్‌రాజ్ అవయవాల్ని తొలగించారు. అన్నింటినీ ఫ్రీజర్‌లో ఉంచారు. గుండెను ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు తీసుకొచ్చారు. ముందుగా చేసుకున్న ఏర్పాట్ల మేరకు త్వరితగతిన హృదయాన్ని నగరంలోని మలర్ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఓ రోగికి శస్త్ర చికిత్స నిర్వహించి గుండె మార్పిడి చేశారు. అలాగే, మోహన్‌రాజ్ కళ్లు, కిడ్నీ, కాలేయం తదితర అవయవాలు పలు ఆస్పత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. కళ్లను శంకర నేత్రాలయూనికి అప్పగించారు.