అలియా-రణబీర్‌ ఇష్టపడే వంటకాలివే..! | Private chef shares Ranbir Kapoor and Alia Bhatt | Sakshi
Sakshi News home page

అలియా-రణబీర్‌ ఇష్టపడే వంటకాలివే..!

Sep 8 2024 9:58 AM | Updated on Sep 8 2024 10:15 AM

Private chef shares Ranbir Kapoor and Alia Bhatt

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ స్టార్‌ జంట అలియా రణబీర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏ ఈవెంట్‌లో సందడి చేసిన ఫోటోగ్రాఫర్‌లకు తమ కెమెరాలని క్లిక్‌మనిపించకుండా ఉండరు. అలాగే ఆ వేడుకలు కూడా మరింత అందంగా కోలహాలంగా మారిపోతుంది. అంతలా ఈ జంట వేడుకల్లో ఎంజాయ్‌ చేస్తూ..కొత్త సందడిని తీసుకొస్తారు. వీరిద్దరూ తమ గ్లామర్‌, అభినయంతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే డైట్‌ పరంగా ఇద్దరు చాలా స్ట్రిట్‌. ఇరువురు ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ అందమైన జంట ఇష్టంగా వంటకాల గురించి వారి వ్యక్తిగత చెఫ్‌ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

బాలీవుడ్‌ సెలబ్రిటీ జంట వ్యక్తిగత చెప్‌ సూర్యన్ష్‌ సింగ్‌ కున్వర్‌ అలియా-రణబీర్‌లు ఇష్టమైన వంటకాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వాళ్లు కూడా మనలాగానే దోస, ఆమ్లెట్‌, గుడ్డు అప్పం, హమ్ముస్‌, మీట్‌ బాల్స్‌, స్పెఘెట్టి, ఫ్రైడ్‌ రైస్‌, సిన్నమోన్‌ టోస్ట్‌, కొబ్బరి చట్నీ, తదితరాలనే ఇష్టంగా తింటారని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరు రుచికరంగా ఉండే పోషకాహారానికి ప్రాధ్యాన్యత ఇస్తారని తెలిపాడు. అంతేగాదు అలియా, రణబీర్‌ గ్రిల్డ్‌ సాల్మన్‌, డ్రైఫూట్స్‌తో నింపిన సూప్‌, బ్లాక్‌ బీన్ సాస్‌ తోకూడిన టోపు, టోర్టెల్లిని పాస్తా, కలమారి, కుడుములు, ఖీర్‌, కస్టర్డ్‌ వంటి ఆకర్ణణీయమెన డెజర్ట్‌ ఇష్టంగా తింటారని చెప్పారు. 

అంతేగాదు గత కొద్ది రోజులగా తాను వాళ్ల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ అందమైన జంట కోసం వడంటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వంటకాలను ఆహారప్రియులు కూడా తమ మెనూలో చేర్చుకోవచ్చనేలా ఉన్నాయి ఆ రెసిపీలు. కాగా, అలియా భట్ రణబీర్ కపూర్‌లు తమ డైట్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్‌, సినిమాల మధ్య కూడా, రణబీర్ తన డైట్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు.

 

(చదవండి: స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతగా పీహెచ్‌డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement