స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతగా పీహెచ్‌డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా! | American Vlogger Spots PhD Scholar Selling Street Food In Tamil Nadu | Sakshi
Sakshi News home page

స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రేతగా పీహెచ్‌డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!

Published Sun, Sep 8 2024 8:05 AM | Last Updated on Sun, Sep 8 2024 11:27 AM

American Vlogger Spots PhD Scholar Selling Street Food In Tamil Nadu

పెద్ద పెద్ద చదువులు చదవి కూడా తన అర్హతకు సరిపోని ఉద్యోగాల్లో పార్ట్‌టైం చేస్తూ తమ భవిష్యత్తు బాటలు వేసుకుంటారు. అలాగే నామోషీగా వంటి ఫీలింగ్స్‌ ఏం లేకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తారు. పొరపాటున కూడా తామెంటనేది పెదవివిప్పరు. అలాంటి వ్యక్తిని చూసి అమెరికా వ్లాగర్‌ ఆశ్చర్యపోయాడు. ఓ గొప్ప వ్యక్తిని కలిశానన్న భావంతో అతడితో సంభాషించిన వీడియోని షేర్‌ చేస్తూ అతడి గొప్పతనం గురించి వివరించాడు.

ఏం చెప్పాడంటే..అమెరికన్‌ వ్లాగర్‌ క్రిస్టోఫర్‌ లూయిస్‌ ఇటీవల అనుకోని విధంగా బయోటెక్నాలజీలో పీహెచ్‌డి చేసిన విద్యార్థిని కలుసుకుంటాడు. అతడు గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో తమిళనాడులో చెన్నైలో ప్రయాణిస్తుండగా సమీపంలో ఉన్న స్ట్రీట్‌ ఫుడ్‌ బండి అతడిని ఎందుకో ఆకర్షించింది. అక్కడకువెళ్లి ఒక ప్లేట్‌ చికెన్‌ 65 ఆర్డర్‌ ఇచ్చాడు. ఇంతలో తాను చెప్పే ఆర్డర్‌ సర్వ్‌ చేసేలోపల ఆ ఫుడ్‌ విక్రేతతో మాటలు కలిపాడు. అతడితో జరిపిన సంభాషలో ఫుడ్‌ విక్రేత పీహెచ్‌డీ చేసిన విద్యార్థి అని తెలిసి విస్తుపోతాడు. 

అంతేగాదు సదరు వ్యక్తి తన పేరు, తన పరిశోధన పత్రాన్ని ఆన్‌లైన్‌లో సర్చ్‌ చేయమని చెబుతాడు. ఇంత ఉన్నత చదువులు చదివి కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖర్చులకోసం ఇలా కష్టపడుతున్న ఆ విద్యార్థిని చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పట్టరాని ఆనందంతో అతడితో ముచ్చటించిన వీడియోని నెట్టింట షేర్‌ చేయడమే గాక 100 డాలర్లు(మన కరెన్సీలో రూ. 8000లు) గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేగాదు ఇలా ఓ విద్యార్థి ఇలా తన విద్యా లక్ష్యాల కోసం స్ట్రీట్‌ ఫుడ్‌ కార్ట్‌ని నడుపుతుండటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. 

అతడి హార్డ్‌వర్క్‌కి ఫిదా అవ్వుతూ ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత చదువుతున్న విద్యార్థులు ఇలానే కష్టపడుతున్నారంటూ చర్చకలకు దారితీసింది. కాగా, క్రిస్‌ బుహారి హోటల్‌కి చేరుకోవాలి. ఇది చికెన్‌ 65కి పేరుగాంచింది. ఈ రుచకరమైన వంటకం తమిళనాడు ఏఎం బుహరీ హోటల్‌ రూపొందించింది. ఆ తర్వాత కాలక్రమేణ చికెన్‌ 78, చికెన్‌ 82, చికెన్‌ 90 వంటి వైవిధ్యకరమైన వంటకాలు వచ్చాయి.

 

(చదవండి: హాట్‌టాపిక్‌గా సల్మాన్‌ ఖాన్‌ బాడీ గార్డ్‌ హెల్తీ డైట్‌..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement