హాట్‌టాపిక్‌గా సల్మాన్‌ ఖాన్‌ బాడీ గార్డ్‌ హెల్తీ డైట్‌..! | Salman Khan's Bodyguard Shera On Eating A Healthy Diet | Sakshi
Sakshi News home page

హాట్‌టాపిక్‌గా సల్మాన్‌ ఖాన్‌ బాడీ గార్డ్‌ హెల్తీ డైట్‌..!

Published Fri, Sep 6 2024 3:08 PM | Last Updated on Fri, Sep 6 2024 3:22 PM

Salman Khan's Bodyguard Shera On Eating A Healthy Diet

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనకు ఫ్యాన్సే. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత అంగ రక్షకుడు షేరా డైట్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సల్మాన్‌ ప్రతి షోకి వెంట ఉంటే షేరా గురించి పాటించే ఆహార నియమాలపై సల్మాన్‌ అభిమాను కుతుహలం ఎక్కువ. 

ఎందుకంటే భాయిజాన్‌ను రక్షించే అతడు కూడా మంచి ఫిట్‌గా కనిపించడమే అందుకు కారణం.  అనునిత్యం సల్మాన్‌ని రక్షిస్తుండే అతడు ఏం తింటాడు దాని గురించి అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే షేరా ఒక ఇంటర్వ్యూలో తన డైట్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రతిదీ హ్యాపీగా తింటానని, కానీ బ్రెడ్‌, రోటీ లేదా శుద్దీ చేసిన ఆహారాల జోలికి మాత్రం పోనని అన్నారు. అంతేగా రోజంతా యాక్టివిగ్‌ ఉండేందుకు కచ్చితంగా భోజనానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. 

అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని చెప్పారు. ఆరోగ్యంగా ఉండేలా సరైన వంటకాలను ఎంచుకోవాలని చెబుతున్నాడు. అలాగే సల్మాన్‌తో తనకు గల విడదీయరాని బంధం గురించి చెప్పారు. అలాగే తన కొడుకు హీరోగా లాంచ్‌ చేసే విషయంలో సల్మాన్‌ తనకు ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నారని అన్నారు. అలాగే తమ మధ్య ఎలాంటి సాంస్కృతిక విభేదాలు తలెత్త లేదని చెప్పారు. కాగా, సల్మాన్‌కి అంగరక్షకుడిగా 1990ల నుంచి పనిచేశాడు. ఆ తర్వాత 2019లో రాజకీయల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన సల్మాన్‌ని రక్షించడంలో చాలా అంకితభావంతో పనిచేస్తాడని పేరు ఉండటం విశేషం.

(చదవండి: ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement