California: తీరాన్ని ముంచెత్తుతున్న రాకాసి అలలు | Huge Wave Lashes Southern California Shores And Many Left Injured, Video Goes Viral - Sakshi
Sakshi News home page

California: కాలిఫోర్నియాను భయపెడుతున్న భారీ అలలు

Published Fri, Dec 29 2023 9:01 PM | Last Updated on Sat, Dec 30 2023 11:34 AM

Huge Wave Lashes California Shores - Sakshi

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన్ని సునామీ తరహాలో రాకాసి అలలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పసిఫిక్‌ మహా సముద్రం అలజడిగా మారడంతో భారీ అలలు వస్తున్నాయి. రాకాసి అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో తీరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి నుంచి తరలివెళ్లాల్సిందిగా తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వెంచూరా ప్రాంతంలో ఒక రాకాసి అల తీరాన్ని బలంగా తాకడంతో అక్కడ ఉన్న వారంతా భయపడుతూ పరుగులు తీయాల్సి వచ్చింది. నీళ్లు వేగంగా వారిని వెంబడించాయి. కాలిఫోర్నియాలోని మారిన్‌ కౌంటీతో పాటు క్యాపిటోలా గ్రామంలో ప్రజలను తరలివెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. రాకాసి అలలు ఒక్కొక్కటి 28 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు వస్తాయని, ఒక్కో అల 40 అడుగుల ఎత్తు వరకు ఉండొచ్చని నేషనల్‌ వెదర్‌ సర్వీసు కేంద్రం తెలిపింది.

లోతట్టు ప్రాంతాల్లో వరదలు రావొచ్చని హెచ్చరించింది.ఈ వారంతంలో అలలు మరింత భయానకంగా మారొచ్చని సాన్‌డియాగో ప్రాంతంలో అత్యంత భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఉండే రాళ్లు, జెట్టీలు, పియర్స్‌ లాంటివాటిపై ఎవరూ ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.  

ఇదీచదవండి..యూఎన్‌ బృందంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ కాల్పులు  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement