
తైపే: తైవాన్ తూర్పుతీరంలో శుక్రవారం(ఆగస్టు16) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్డర్‌స్కేల్‌పై 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియలాజికల్‌సర్వే తెలిపింది. హులియెన్ నగరం సమీపంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైనట్లు తైవాన్ కేంద్ర వాతావారణ కేంద్రం వెల్లడించింది.
భూకంపం విషయాన్ని తైవాన్ వాతావరణ కేంద్రం ముందుగానే పౌరులకు మొబైల్‌ఫోన్ సందేశాల రూపంలో చేరవేసింది. ఎక్కడివారక్కడ జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తైవాన్ నేషనల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment