సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు ఈ ఏడాది హ్యాపీ న్యూఇయర్ కాబోతుంది. ఈ ఏడాదిలో రోబోటిక్స్ నిపుణులకు 50-60 శాతం ఎక్కువ డిమాండ్ ఉండబోతుందని హ్యుమన్ రిసోర్స్, సెర్చ్ ఎక్స్‌పర్ట్‌లు అంచనావేస్తున్నారు. వ్యాపార వ్యూహాలపై మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రభావం చూపనున్నట్టు పేర్కొన్నారు. పునరావృత పనులను మిషన్లు తగ్గిస్తాయని, రోబోటిక్స్, ఏఐ, బిగ్ డేటా, అనాలిటిక్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని ఓరాకిల్ ఆసియా-పసిఫిక్ రీజన్ సీనియర్ డైరెక్టర్ షఖున్ ఖన్నా చెప్పారు. ఐఓటీ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగాలు గత మూడేళ్లలో నాలిగింతలు పెరిగాయని బిలాంగ్ అంచనావేసింది. గత కొన్నేళ్లలో ఏఐలో డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్ నిపుణులకు డిమాండ్ 76 శాతం పెంచినట్టు పేర్కొంది.
వ్యాపారం, ఆర్థిక సర్వీసులు, ఇన్సూరెన్స్, ఈకామర్స్, స్టార్టప్‌లు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాల్లో ఎంట్రీ నుంచి మధ్య స్థాయి, సీనియర్ స్థాయి వరకు డిమాండ్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రక్రియ ఆధారిత కంపెనీలకు మంచి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రోబోటిక్స్ అవసరం ఉందని, ఇది వ్యయాలను తగ్గించి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కెల్లీ సర్వీసెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. భారత్‌లో సుమారు 7వేల నుంచి 10వేల డేటా సైంటిస్ట్‌లు ఉన్నారని, 4 నుంచి 5 ఏళ్ల అనుభవమున్న వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. డేటా అనాలిటిక్స్‌కు ప్రారంభ వేతనమే రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలుంటుందని, 10 కంటే ఎక్కువ అనుభవమున్న ఏఐ నిపుణులకు రూ.60 లక్షల నుంచి రూ.1.5 కోట్లు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment