ఫిబ్రవరిలో రోబోఫెస్ట్-2014
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో రోబోటిక్స్‌పై చైతన్యం పెంచేందు కు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా వెస్ట్ ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, లక్ష్మిప్రయాగ తెలిపారు. బెంగళూరుకు చెందిన నోవాటెక్ రోబో సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్‌లో ఆదివారం రోబో టెక్నాలజీపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... వచ్చే ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లోని ఇండస్ వరల్డ్ స్కూల్‌లో రోబోఫెస్ట్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని వివిధ సంస్థలు ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో సాంకేతిక యుగంలో రోబోల పాత్ర, ప్రాధాన్యం గురించి వివరిస్తారని చెప్పారు. రోబోటిక్ ఇంటరాక్టివ్ లర్నింగ్ ఎన్విరాన్‌మెంట్ పేరుతో ఇప్పటికే పాఠ్యాంశాలను రూపొందించామని తెలిపారు.