విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
– రోబోటిక్స్‌పై జాతీయ సదస్సులో బృందావన్ కాలేజీ అకాడమిక్ డైరక్టర్ పిలుపు
కల్లూరు (రూరల్): విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని బృందావన్ ఇంజినీరింగ్ కళాశాల అకాడమిక్ డైరక్టర్ ఎన్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పెద్దటేకూరులోని బృందావన్ ఇన్స్‌ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం 'రోబోటిక్స్'పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కళాశాల అకాడమిక్ డైరక్టర్ హాజరై మాట్లాడారు. పుస్తక పరిజ్ఞానం ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోదన్నారు. హైదరాబాద్ డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ పి. సాయికృష్ణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక రంగంలో దూసుకెళ్తేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. గిరీష్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్స్ ప్రొఫెసర్ ఎస్.రమేష్‌రెడ్డి, ఎస్ నారాయణరెడ్డి, డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ టి. శివప్రసాద్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. హరికుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.