ఎంతగా నేర్పిస్తే మాత్రం పాములు ఎక్కడైనా నడుస్తాయా ఏంటి అనుకుంటున్నారా? ఊరకే ఎందుకు నడుస్తాయి? వాటికి నడిచే సాధనాన్ని సమకూరుస్తే భేషుగ్గా నడుస్తాయి. పాములకు నడిచే సాధనమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! మామూలుగా పాకే పాములకు నడిచే సాధనాన్ని తయారు చేశాడు అలెన్ పాన్ అనే ఔత్సాహిక అమెరికన్ యూట్యూబర్.
ఒక పొడవాటి గొట్టం, దానికి రెండువైపులా రెండేసి ప్లాస్టిక్ కాళ్లను అమర్చి, రోబోటిక్ పరిజ్ఞానంతో దీనిని తయారు చేశాడు. ఈ ఫొటో చూశారు కదా, రోబో వాహనంలో ఇమిడిపోయిన పాము ఎంచక్కా ఎలా నడుస్తోందో! నిజానికి 15 కోట్ల ఏళ్ల కిందట పాములకు కూడా కాళ్లు ఉండేవి. పరిణామ క్రమంలో అవి కాళ్లను కోల్పోయాయి. ఇన్నాళ్లకు వాటికి మళ్లీ కృత్రిమంగానైనా, కాళ్లు వచ్చాయి. భలేగా ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment