శస్త్రచికిత్సకు ‘రోబో’
వాషింగ్టన్: వైద్య చికిత్సల్లో రోబోల వాడకం విస్తృతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి శరీరంపై చిన్న గాటు చేసి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్స చేసే రోబోటిక్ పరికరాన్ని అమెరికాలోని మిచిగాన్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందులో భారత సంతతి శాస్త్రవేత్త శోర్య అవతార్ ఉండటం విశేషం.
ఫ్లెక్స్‌డెక్స్ అనే ఈ రోబోటిక్ పరికరాన్ని వైద్యులు తమ చేతికి ధరించి దానికి మార్గదర్శకం చేయడం ద్వారా చికిత్స నిర్వహించవచ్చని పరిశోధకులు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వీలుగా దీనికి సహజమైన సూదిని అమర్చారు. ఈ పద్ధతిలో చికిత్స నిర్వహించడం ద్వారా తక్కువ ఖర్చు, సన్నటి రంధ్రం, తక్కువ నొప్పి, గాయం త్వరగా మానే అవకాశం.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఈ పరికరం ధర కేవలం రూ.33 వేలు.