ఇక నుంచి రోబోలే మానసిక వైద్యులు
లండన్: మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇక నుంచి రోబోల(కంప్యూటర్ అవతార్) సహాయం తీసుకోవచ్చు. మానసికంగా బాధపడే వారి ఆలోచనలకు తగిన విధంగా ఈ అవతార్‌లు పనిచేస్తాయి. ఎదుటి వ్యక్తి మానసిక రుగ్మతలకు సరిపోలుతూ వీటి ఆలోచనలు ఉంటాయి. అంటే బాధలో ఉన్న వ్యక్తికి మిర్రర్ గేమ్ ద్వారా అవతార్‌లు ఉపశమనం కలిగిస్తాయి. మిర్రర్‌గేమ్‌లో రెండు విభిన్న రంగుల బంతులను సమాంతరంగా కదిలించడం ద్వారా ఇద్దరి వ్యక్తుల ఆలోచనలను పరస్పరం అర్థం చేసుకోవచ్చు.
ఇదే తీరుగా అవతార్ కూడా రోగి మానసిక స్థితిని అర్థం చేసుకుంటుందని ఇంగ్లాండుకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ముందస్తుగా ఈ అవతార్ మానసిక రోగివలె ప్రవర్తించి వారి రుగ్మతకు గల కారణాలు తెలుసుకుంటుంది. అనంతరంచికిత్స ప్రారంభిస్తుంది. బాధతో ఉన్న వ్యక్తిని సాధారణ స్థితికి తీసుకొచ్చేంత వరకు చికిత్స అందిస్తుంది’ అని ప్రొఫెసర్ మేరియో వెల్లడించారు.