Drishti
-
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్‌తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్‌ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్‌ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్‌కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్‌లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
నీటి పొదుపుతోనే భవితకు భరోసా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పెరుగుతున్న నీటి అవసరాల నేపథ్యంలో భూగర్భ జల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించగలమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా తిరిగి సాగునీటికి, పరిశ్రమలకు అందించేలా రీ సైక్లింగ్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. చెరువులు, కుంటలను సంరక్షిస్తూ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో డ్యామ్‌ల పరిరక్షణకు ప్రధాని మోదీ సూచనల మేరకు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ (ఐసీఐడీ) సదస్సును సీఎం జగన్‌తో కలసి ఆయన ప్రారంభించారు. అతి సుందరమైన విశాఖ నగరం దీనికి వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఐసీఐడీ కాంగ్రెస్‌కు ఆతిథ్యమిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ఏమన్నారంటే.. 140 బిలియన్ డాలర్ల వ్యయం వ్యవసాయ రంగంలో నీటి కొరతను అధిగమించేందుకు బహుళ విధానాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సాగునీటి రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సరైన ప్రణాళిక లేకుంటే వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినడంతో పాటు కరువు పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో సాగునీటికి అనుబంధంగా ఉన్న అన్ని విభాగాలను 2019లో ప్రధాని మోదీ జలశక్తి శాఖ ఆదీనంలోకి తెచ్చారు. 2024 నాటికి సాగునీరు, పారిశుధ్య రంగాలపై 140 బిలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించాం. దేశంలో సాగు విస్తీర్ణం గత 75 ఏళ్లలో మూడింతలు పెరిగి 140 మిలియన్ హెక్టార్లకు చేరింది. దిగుమతి చేసుకునే దశ నుంచి ఈ రోజు తిండిగింజల్లో మిగులు దేశంగా మారడంలో సాగునీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 54 ప్రాజెక్టులు.. నీటి వనరులను అవసరాల మేరకు వినియోగించుకునేందుకు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దేశంలో 1971లో 111 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉండగా నేడు 250 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరింది. 2023 మార్చిలో ప్రధాని మోదీ 54 ప్రాజెక్టులను ప్రారంభించి అదనంగా 25 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడం ద్వారా రెండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. గత రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో దేశంలో తలసరి నీటి లభ్యత 20 శాతం తగ్గింది. 2050 నాటికి మరో 20 శాతం తగ్గనుందని అంచనాలున్నాయి. నీటి వినియోగాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు 2022లో బ్యూరో ఆఫ్ వాటర్ ఎఫిషియన్సీని నియమించాం. 48,500 కి.మీ. మేర మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశాం. తద్వారా 28,000 హెక్టార్ల భూ సేకరణను తగ్గించాం. నీటి శుద్ధిపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంలో భాగంగా మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నీటిని సాగునీటికి, పరిశ్రమలకు ఉపయోగించుకోవడంపై దృష్టి సారించాం. ఇందుకోసం దేశవ్యాప్తంగా వాటర్ రీ–సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. అమెరికా, చైనా కలిపి వినియోగిస్తున్న భూగర్భ నీటి వనరుల కంటే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ప్రపంచంలోనే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో మనం ముందు వరుసలో ఉన్నాం. భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా మొత్తం 2.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గుర్తించాం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచేందుకు మ్యాపింగ్ పూర్తి చేశాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు 2019లో జలశక్తి అభియాన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. పూడిక తొలగించి వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు 10 వేల మిలియన్ పనులను పూర్తి చేశాం. నదుల అనుసంధానం.. జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే సమయంలో సాధ్యమైనంత నీటిని ఒడిసి పట్టుకునేందుకు నదుల అనుసంధానాన్ని ప్రారంభించాం. నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న చోట్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నాం. సాగునీటి రంగం రాష్ట్ర పరిధిలోది కావడం వల్ల వాటి సహకారం ఎంతో అవసరం. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయు) చేసుకున్నాయి. కెన్, బెత్వా నదుల అనుసంధానంతో మిలియన్ హెక్టార్లకు సాగునీటితోపాటు వెనుకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 6.2 మిలియన్ జనాభాకు తాగునీరు లభించనుంది. డ్యామ్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు దేశంలో జలాశయాల నిర్మాణం ఎప్పటి నుంచో ఉంది. కావేరి నదిపై చోళుల కాలంలో 2 వేల ఏళ్ల క్రితం నిరి్మంచిన కళ్లాని డ్యామ్ ఇప్పటికీ ఉంది. దేశంలో మొత్తం 6,000 భారీ డ్యామ్‌లున్నాయి. 2020లో డ్యాం సేఫ్టీ చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రపంచబ్యాంకు సహకారంతో 1.2 బిలియన్ డాలర్లతో దేశవ్యాప్తంగా 736 డ్యాంల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో 223 డ్యామ్‌ల హైడ్రలాజికల్, స్ట్రక్చరల్, ఆపరేషనల్ రక్షణ చర్యలను పరిశీలించాం. డ్యామ్‌ల రక్షణతో పాటు నీటి వనరుల వినియోగంపై ఐసీఐడీ చర్చించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సూచనలు చేస్తుందని భావిస్తున్నా. నదీ జలాలతో ‘జల్ భరో’ విశాఖ ఐసీఐడీ సదస్సు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ నదుల నుంచి సేకరించిన జలాలను మట్టి కుండల్లో నింపి ‘జల్ భరో’ పేరుతో ఒకే చోట చేర్చారు. కేంద్ర మంత్రి షెకావత్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్, విడదల రజని మట్టి కుండల్లో ఉన్న నీటిని తరలించి ఒక చోట చేర్చారు. 25 ఐసీఐడీ అంతర్జాతీయ కాంగ్రెస్ యాబ్‌స్ట్రాక్ట్ వాల్యూమ్‌తో పాటు హిస్టారికల్ వాటర్ సస్టైనబులిటీ, వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వాల్యూమ్‌ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సదస్సులో తొలి రోజు సంప్రదాయేతర నీటి వనరులు, రైతు సాధికారత, సుస్థిర లక్ష్యాలు, వ్యవసాయ రంగంలో నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. 56 దేశాలు... 147 పరిశోధన పత్రాలు 1950లో ఏర్పడిన ఐసీఐడీ పరిశోధనలను మనం వినియోగించుకుంటున్నాం. 74 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. 2025 నాటికి పెరగనున్న 9.8 బిలియన్ జనాభాకు అనుగుణంగా నీటి వనరులను వాడుకోవడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై సదస్సులో చర్చించాలి. నీటి వినియోగంపై 56 దేశాలకు చెందిన ప్రతినిధులు 147 పరిశోధన పత్రాలను సమర్పిస్తారు. సమస్యను పరిష్కరించేందుకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాం. ఈ సదస్సుకు సుందర నగరం విశాఖ కేంద్రం కావడం ఎంతో సంతోషంగా ఉంది. –ప్రొఫెసర్ డాక్టర్ రగబ్, ఐసీఐడీ ప్రెసిడెంట్ పర్యావరణ సమతుల్యతపై దృష్టి నీటి వనరులను పొదుపుగా వాడుకునేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తిండి గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. –కుశ్వందర్ వోహ్రా, ఐసీఐడీ వైస్ ప్రెసిడెంట్ -
నీటి బొట్టూ ఒడిసి పట్టి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతి నీటి బొట్టూ ఒడిసి పట్టి సాగు అవసరాలను తీరుస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. నీటి కొరతను అధిగమించేందుకు ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాదిలో తక్కువ కాలం మాత్రమే కురిసే వాన నీటిని ఒడిసి పట్టి ఆయకట్టుకు అందించడం ద్వారా కరువును సమర్థంగా నివారించవచ్చన్నారు. గురువారం విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ¯ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. మొత్తం 90 దేశాలకు చెందిన ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. సుస్థిర వ్యవసాయం, నీటి నిర్వహణకు గట్టి కృషి చేస్తున్న ఐసీఐడీ సదస్సును రాష్ట్రంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ప్రశాంతమైన విశాఖ నగరం అతిథులకు చక్కటి అనుభూతి అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నీటి నిర్వహణలో సరికొత్త మార్గాలపై సదస్సులో చర్చించడం ద్వారా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సుస్థిర సాగు కోసం ప్రతిష్టాత్మక 25వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) సదస్సును ఈనెల 4 వరకు, 74వ అంతర్జాతీయ కార్యనిర్వాహక కమిటీ (ఐఈసీ) సమావేశాన్ని 5వ తేదీ నుంచి 8 వరకు మొత్తంగా ఎనిమిది రోజులపాటు అందమైన విశాఖ నగరంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహణపై మా ప్రతిపాదనను అంగీకరించినందుకు ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్సీఐడీ), కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఐడీకి చెందిన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కృతజ్ఞతలు. నీటి నిర్వహణ ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటైన ఈ ఫోరం నీటి పారుదల, డ్రైనేజ్, వరద నిర్వహణలో అందిస్తున్న సహకారం ప్రశంసనీయం. ‘మోర్ క్రాప్ పర్ డ్రాప్’ వ్యవసాయం, నీటి పారుదల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ శతాబ్దాలుగా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రధాన, మధ్య తరహా, చిన్న నదులు 40 వరకు ఉన్నాయి. కరువు పీడిత, మెట్ట ప్రాంతాలలో నీటి పారుదల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రధానమంత్రి సూచించిన విధంగా ‘మోర్ క్రాప్ పర్ డ్రాప్’ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం. తద్వారా ప్రతీ నీటి బొట్టుకు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దిగువ రాష్ట్రం కావడంతో రాష్ట్రానికి సువిశాల తీర ప్రాంతం ఉన్నా రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాలు తక్కువ వర్షపాతం కారణంగా తరచుగా కరువు బారిన పడుతున్నాయి. ఆ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను ఇది దెబ్బతీస్తోంది. ఆంధ్రప్రదేశ్ దిగువ నదీ తీర రాష్ట్రం కావడంతో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి ప్రధాన అంతర్రాష్ట్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు నీటి కొరత సమస్య ఎదురవుతోంది. అధిక వర్షాలు, వరదల వల్ల ఈ నదుల పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టాలను చవి చూస్తున్నాం. సమర్థ నీటి పారుదల నిర్వహణ మాత్రమే దీనికి మంచి పరిష్కారం చూపుతుంది. అనుసంధానమే పరిష్కారం నీటి కొరత గురించి ప్రస్తావించినప్పుడు మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ గుర్తుకొస్తాయి. నీటిని ఎలా వినియోగించుకోవాలనేందుకు ఈ తరహా ఆలోచనలు అవసరమే. అయితే నా ఉద్దేశం ప్రకారం వర్షా కాలంలో నీటి బదలాయింపు అంశంపై మరింత విస్తృతంగా చర్చ జరగాలి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు వర్షా కాలం. ఈ సీజన్లో వర్షాలు కురిసి నదులు వరదతో ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు కురిసే కాలం తక్కువగా ఉన్నా వర్షపాతం అధికంగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడం సవాల్‌తో కూడుకున్నది. అయినప్పటికీ దీని ద్వారా మాత్రమే వ్యవసాయ రంగంలో నీటి కొరత సమస్యను అధిగమించవచ్చన్నది నా గట్టి నమ్మకం. నిర్ణీత కాల వ్యవధిలో ఇలా ఒక బేసిన్ నుంచి మరొక బేసిన్‌కు నీటిని తరలించగలిగితే ఆయా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని సమర్థంగా వినియోగించుకోవచ్చు. కాలువల ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీటిని తరలించగలుగుతాం. దీనిపై ఈ సమావేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఆమోదయోగ్య మార్గాలపై దృష్టి నీటి నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చిస్తారని భావిస్తున్నా. అయితే సాంకేతికంగా సాధ్యం కావడంతో పాటు ఆర్థికంగా లాభదాయకమైన పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఈ పరిష్కారాలు సామాజికంగా ఆమోదయోగ్యంగా, పర్యావరణ అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నా. నీటి పారుదల, వరద నిర్వహణ రంగాలపై ఈ సదస్సులో జరిగే చర్చలు, ఆలోచనలు, సిఫారసులు భవిష్యత్తుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని గాఢంగా విశ్వసిస్తున్నా. ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో డెల్టా రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డుల కోసం అందిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి నాలుగు నిర్మాణాలకు ఈ అవార్డు దక్కింది. అందులో ప్రకాశం బ్యారేజీకి చోటు దక్కింది. విశాఖలో ఐసీఐడీ సదస్సు సందర్భంగా అవార్డును జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్ కలసి అందించారు. తమిళనాడులోని శ్రీవైకుంఠం ఆనకట్ట, ఒడిశాలోని బలిదా ఇరిగేషన్ జయమంగళ ఆనకట్టలకు కూడా ఈ అవార్డులు లభించాయి. -
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
విస్తృత భేటీలు.. ముమ్మర ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపు ఎత్తుగడల్లో భాగంగా బీజేపీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రిజర్వ్ స్థానాల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.రిజర్వ్డ్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ఆరేడు వేల మం ది కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించనుంది. ఆయా భేటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానా లను ఎండగట్టాలని, సీఎం కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 అసెంబ్లీ స్థానాలకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఇప్పటికే జాతీయ నాయకులు ఆయా నియోజకవ ర్గాల్లోని నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, నేతలు అరవింద్ మీనన్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రం నుంచి 20 నుంచి 30 మంది కార్యకర్తలతో బూత్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను ఏవిధంగా తుంగలో తొక్కిందన్న అంశాలను వివరించడంతోపాటు, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు / గిరిజనులకు అమలు అవుతున్న పథకాల గురించి వివరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చిందనే విషయాన్ని కూడా వివరిస్తామని బీజేపీ ముఖ్య నాయకుడు ఒకరు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లలో దళితులు, గిరిజనులను ఓట్లు వేయించుకోవడానికి వాడుకోవడం తప్ప.. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించని విషయాన్ని కూడా వివరి స్తామని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని వివరించారు. పార్టీ నేతలతో జవదేకర్ భేటీ తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయ డంతో పాటు, ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రకాష్ జవదేకర్ శుక్రవారం మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలతో సమా వేశమయ్యారు. పార్టీ పటిష్టత, లోపాలకు సంబంధించి అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
దృష్టి ఎవరి పైన?
‘అందాల రాక్షసి, అలా ఎలా?’ సినిమాల ఫేమ్ రాహుల్ రవీంద్రన్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎమ్స్క్వేర్ పతాకంపై మోహన్ నిర్మించిన సినిమా ‘దృష్టి’. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథకు తగ్గ పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. ‘దృష్టి’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రాహుల్‌ను ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. పావనీ గంగిరెడ్డి హీరోయిన్గా, ‘వెన్నెల’ కిశోర్, సత్య ప్రకాశ్, రవి వర్మ, ప్రమోదిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీనివాస్ మోతుకూరి, కథ: బి. భానుకిరణ్, కూర్పు: ఉద్ధవ్ ఎస్.బి., కెమెరా: పి. బాలరెడ్డి, సంగీతం: నరేశ్ కుమారన్. -
పెట్టుబడుల హవా కొనసాగిస్తున్న నందన్ నీలేకని
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నందన్ నీలేకని తన పెట్టుబడుల హవాను కొనసాగిస్తున్నారు. వివిధ స్టార్టప్ కంపెనీలు సహా, రైల్ నీల్ లో ఇటీవల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన ఆయన తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐ కేర్ సంస్థ' దృష్టి' లో పెట్టుబడులు పెడుతున్నట్టు వెల్లడించారు. దీని ద్వారా దృష్టి సంస్థ అభివృద్ధితోపాటు, ప్రజలకు మెరుగైన కంటి చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రధాన ఉద్దేశమన్నారు. అయితే పెట్టిన పెట్టుబడి మొత్తం ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ పెట్టుబడులుద్వారా తమ సర్వీసులను మరింత మెరుగుపర్చనున్నట్టు 'దృష్టి' సీఈవో కిరణ ఆనందంపిళ్లై తెలిపారు. ఈ ఫండ్స్ తో కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో దృష్టి సేవలను విస్తరించనున్నట్టు చెప్పారు. తన పెట్టుబడుల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటానని, ముఖ్యంగా సామాజిక సమస్యలు పరిష్కరించడానికి ఆసక్తి చూపిస్తున్న సంస్థలనే ఎంచుకుంటానని నీలేకని తెలిపారు. కాగా ఈ సంవత్సరం ప్రారంభంలోముంబై ఆధారిత కంపెనీ సెడేమ్యాక్ మెకట్రానిక్స్ 50 కోట్లు పెట్టుబడి పెట్టారు. అనంతరం రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్ (యాప్), వెబ్-సైట్ రైల్ యాత్రి.ఇన్-లో కూడా పెట్టుబడులు పెట్టిన సంగతితెలిసిందే. మరోవైపు ఈ మధ్యకాలంలో నీలేకని పెట్టుబడుల్లో ఇదే అత్యంత పెద్ద మొత్తమని తెలుస్తోంది.