పెట్టుబడుల హవా కొనసాగిస్తున్న నందన్ నీలేకని | Bangalore-based Drishti gets funding from billionaire Nandan Nilekani | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల హవా కొనసాగిస్తున్న నందన్ నీలేకని

Published Thu, Jun 23 2016 2:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

పెట్టుబడుల హవా కొనసాగిస్తున్న నందన్ నీలేకని

పెట్టుబడుల హవా కొనసాగిస్తున్న నందన్ నీలేకని

బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నందన్ నీలేకని తన  పెట్టుబడుల హవాను కొనసాగిస్తున్నారు.  వివిధ స్టార్టప్ కంపెనీలు సహా, రైల్ నీల్ లో ఇటీవల  కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన ఆయన తాజాగా   బెంగళూరుకు చెందిన  ప్రముఖ ఐ కేర్‌  సంస్థ' దృష్టి' లో  పెట్టుబడులు పెడుతున్నట్టు  వెల్లడించారు. దీని ద్వారా దృష్టి సంస్థ  అభివృద్ధితోపాటు,  ప్రజలకు మెరుగైన కంటి చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రధాన ఉద్దేశమన్నారు.   అయితే పెట్టిన పెట్టుబడి మొత్తం ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. 

ఈ పెట్టుబడులుద్వారా తమ సర్వీసులను మరింత మెరుగుపర్చనున్నట్టు 'దృష్టి' సీఈవో కిరణ ఆనందంపిళ్లై  తెలిపారు. ఈ ఫండ్స్ తో కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో  దృష్టి సేవలను విస్తరించనున్నట్టు  చెప్పారు.  తన పెట్టుబడుల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటానని, ముఖ్యంగా  సామాజిక సమస్యలు పరిష్కరించడానికి ఆసక్తి చూపిస్తున్న సంస్థలనే ఎంచుకుంటానని  నీలేకని  తెలిపారు.

కాగా ఈ సంవత్సరం ప్రారంభంలోముంబై  ఆధారిత కంపెనీ సెడేమ్యాక్  మెకట్రానిక్స్ 50 కోట్లు పెట్టుబడి పెట్టారు.  అనంతరం రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్ (యాప్), వెబ్‌-సైట్ రైల్‌ యాత్రి.ఇన్‌-లో  కూడా పెట్టుబడులు పెట్టిన సంగతితెలిసిందే. మరోవైపు ఈ మధ్యకాలంలో నీలేకని పెట్టుబడుల్లో ఇదే అత్యంత పెద్ద మొత్తమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement