Hyperlocal News Startup Lokal Gets Rs 120 Crore Sony Fund Sign Series B - Sakshi
Sakshi News home page

లోకల్‌’కు 120 కోట్ల నిధులు

Published Tue, Apr 25 2023 3:20 PM | Last Updated on Tue, Apr 25 2023 3:37 PM

Hyperlocal News Startup Lokal gets rs120 crores Sony Fund Series B - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైపర్‌లోకల్‌ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్‌ వేదిక అయిన లోకల్‌ తాజాగా రూ.120 కోట్ల సిరీస్‌-బి ఫండింగ్‌ అందుకుంది. గ్లోబల్‌ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్‌ ఫండ్, ఇండియా కోషెంట్‌ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్‌ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్‌: ఉపాసన పింక్‌ డ్రెస్‌ బ్రాండ్‌, ధర ఎంతో తెలుసా?)

తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్‌ అందుకున్నట్టు లోకల్‌ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్‌ యాప్‌ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్‌డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్‌లు, క్లాసిఫైడ్స్‌ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి.   (బిచ్చగాళ్లను  పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement