శిక్షణకు నిథమ్.. వంటల్లో శిక్షణా కార్యక్రమం
రుచికి అద్భుతం
చికెన్ బిర్యాని, సాధారణ బిర్యాని, బేసిక్ గ్రేవీస్, తెలంగాణ స్నాక్స్, రైతా, వెజ్ దమ్ బిర్యాని, చికెన్ కర్రీ, మిర్చి మసాల, రకరకాల అన్నం తయారీ, టీ, విభిన్న రకాల కాఫీ, సావరీ, వంటి వివిధ మెనూలను అదరగొట్టారు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ల నిర్వాహకులు. చెఫ్‌లు మహేష్ నిథమ్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ప్రముఖ చెఫ్ డాక్టర్ ఎంకె గణేష్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మిసెల్లీ జే ఫ్రాన్సిస్ పర్యవేక్షణలో ఐదో బ్యాచ్‌లో 28 మంది మహిళలకు వంటల తయారీ, క్యాంటీన్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. -రాయదుర్గం
పరిశుభ్రమైన వాతావరణంలో, స్వచ్ఛమైన, నాణ్యమైన వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి అందించేలా ఏర్పాట్లు చేయడం, దీనిపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషమని శిక్షణలో పాల్గొన్న మహిళలు అన్నారు. పదిరోజుల పాటు అందించిన శిక్షణలో భాగంగా చివరి రోజైన సోమవారం మహిళలు నేర్చుకున్న వంటకాలన్నీ స్వయంగా తయారుచేసిన ప్రదర్శించారు. ఈ వంటకాలను నిథమ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (ఎస్‌ఈఆర్‌పీ), పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈఆర్‌పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రావణ్, నిథమ్ అధికారులు శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించారు.
ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం..
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికే క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ఎస్‌ఈఆర్‌పీ డైరెక్టర్ డబ్ల్యూ జాన్సన్ తెలిపారు. శిక్షణ ముగింపు సందర్భంగా మాట్లాడుతూ క్యాంటిన్ల నిర్వహణ ద్వారా వారు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నారని గుర్తు చేశారు. ఆహార పదార్థాల తయారీపై ప్రత్యేక శిక్షణలో నిథమ్‌కు మంచి గుర్తింపు ఉందని, నిర్వాహకులకు ఐదు విడతల వారిగా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సెర్ప్ సీఈఓ డీ దివ్య, పర్యాటక శాఖ, నిథమ్ డైరెక్టర్ జెడ్, హన్మంత్ ఎప్పటికప్పుడు శిక్షణను పర్యవేక్షించారని గుర్తుచేశారు. సెర్ప్, నిథమ్, పర్యాటక శాఖ అధికారులు, ఫ్యాకల్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్టూడెంట్స్‌తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment