గూగుల్ భాగస్వామ్యంతో ఇన్ఫినిటమ్ మీడియా "షి క్రియేట్స్’’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా రంగాల్లో ఉన్న వారి టాలెంట్‌ను గుర్తించి ప్రతిభావంతులైన లేడీ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించి క్రియేషన్ వైపు నడిపించడం, వారిలో ఉన్న టాలెంట్ గుర్తించి ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుకునేలా చేయడం షి క్రియేట్స్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
గూగుల్‌తో కలిసి ఇన్ఫినిటమ్ సుమారు 200 మంది లేడీ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి ఫ్రీగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఇవ్వనుంది. ఛానల్‌ను ఎలా నడిపించాలి? ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి? కంటెంట్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలి? వీడియోలను మానిటైజ్ చేసుకోవడం ఎలా ? యూట్యూబ్ ద్వారా రెవెన్యూ రాబట్టడం ఎలా అనే విషయం మీద 2 వేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.
విశాఖపట్నం ప్రోగ్రాం తర్వాత గూగుల్‌తో కలిసి ఇన్ఫినిటమ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని టైర్ 2 సిటీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆర్థికంగా తమ కాళ్ళ మీద తమ నిలబడేలా చేయడం అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేటర్లుగా ఒక గుర్తింపు తెచ్చే ఉద్దేశంతోనే ఇన్ఫినిటమ్ ఈ అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టడమే కాక వారిని చూసి మరి కొంతమంది ఇన్స్పైర్ అయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూన్సర్లు యూట్యూబ్ డెలిగేట్స్ ను కలిసి తమకు ఉన్న సందేహాలను కూడా తీర్చుకోనున్నారు.
విశాఖ బీచ్ రోడ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ సాయంత్రం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ మరియు భారీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. వైజాగ్ సిటీ, ఉత్తరాంధ్ర చుట్టుపక్కల నుంచి 2000 మంది యువత పాల్గొనేలా భారీ ఏర్పాట్లు ఏయూ ఆడిటోరియంలో చేశారు.
Comments
Please login to add a commentAdd a comment