సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీ హబ్ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది.లండన్ సాంకేతిక వారోత్సవాల్లో (టెక్ వీక్) భాగంగా స్టార్టప్ జీనోమ్, గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్ సంయుక్తంగా గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్ రిపోర్ట్–2021 (జీఎస్‌ఈఆర్)ను విడుదల చేశాయి. జీఎస్‌ఈఆర్ నివేదికలో ఆసియా స్టార్టప్‌ల ఫండింగ్ కేటగిరీలో టీహబ్ 20వ స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 140 ఇకోసిస్టమ్‌లు కలుపుకుని మొత్తంగా 280 ఎంట్రప్రెన్యూర్ ఆవిష్కరణలు, 30 లక్షలకు పైగా స్టార్టప్‌లను లోతుగా పరిశీలించి జీఎస్‌ఈఆర్ నివేదికను రూపొందించారు. ఖండాలు, దేశాలు, ప్రాంతాలవారీగా సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను తయారు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారి నియామకాల్లో 15వ స్థానం, ఫండింగ్, పేటెంట్లు, ఆవిష్కరణల్లో ఆసియాలో 30వ స్థానంలో టీహబ్ నిలిచింది. దీంతో టీ హబ్ సీఈవో రవి నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment