
హార్ట్‌ఫుల్‌నెస్, టీఐఈ గ్లోబ్ నివేదికలో వెల్లడి
ఆర్థిక పరిస్థితులు, పని ఒత్తిడితో నిద్రకు దూరం
వ్యవస్థాపకులు, బిజినెస్ మెన్‌లలో 80 శాతం సమస్య
ఐదు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు నిద్రలేమితో బాధపడుతున్నారట. హైదరాబాద్ సహా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు మొత్తం 260 మందిని సర్వే చేయగా ఆర్థిక అనిశి్చతి, ఎక్కువ సమయం పనిచేయడం, నిర్ణయాలు తీసుకోడానికి అధిక ఒత్తిడిని ఎదుర్కోడం, నిరంతర డిమాండ్లు తదితర అంశాలతో 55 శాతం మంది ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారట. ఇటీవల హార్ట్‌ఫుల్‌నెస్, టీఐఈ గ్లోబల్ సంయుక్తంగా నిద్ర సంక్షోభంపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు ధనవంతులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ యజమానులు, టెక్ నిపుణులకు సైతం నిద్ర పట్టడంలేదని తేలింది. మార్చి 14న ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.
పనితీరుపై ప్రభావం..
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 80 శాతం మంది తగినంత సమయం నిద్రలేకపోవడంతో పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, అలసటకు గురవుతున్నామని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ఏకాగ్రత కోల్పోతున్నామని, ఫలితంగా కార్యాలయ పనితీరును గణనీయంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. నిద్రలేమితో సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారట. 26 శాతం మంది రాత్రి 6 గంటలే నిద్రపోతున్నారని, 19 శాతం మంది చాలా పేవలమైన నిద్రతో ఒత్తిడి, ఆందోళనల కారణంగా నిద్రకు
దూరమవుతున్నారు.
నిద్రను త్యాగం చేస్తున్నారు..
స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపార వేత్తలు తమ విజయాల్లో నిద్రను త్యాగం చేస్తున్నారు. ఉత్పాదకత, నిర్ణయాలు తీసుకోవడం, పనితీరుపై నిద్ర లేమి ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది. స్థిరమైన విజయానికి కీలకమైన ఆరోగ్యకరమైన పని–జీవన సమతుల్యతను సాధించడంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే వనరులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం.
– మురళి, గ్లోబల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్
కేవలం విశ్రాంతి కాదు..
నిద్ర అనేది కేవలం విశ్రాంతి కాదు. మనసు, శరీరం, ఆత్మ పునరుజ్జీవనం పొందడానికి ఒక పవిత్ర అవకాశం. ఆరోగ్యకరమైన నిద్ర పద్ధతులతో జ్ఞానం, సృజనాత్మకత, సమతుల్యతతో నడిపించే సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. అంతర్ దృష్టి బలపడుతుంది. స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
పెరుగుతుంది.
– రెవరెండ్ దాజీ, హార్ట్‌ఫుల్ నెస్ గైడ్, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment