మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో గంటా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు.