టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం | minister ktr extends warm welcome to satya nadella at t hub | Sakshi
Sakshi News home page

టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం

Published Mon, Dec 28 2015 10:12 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం - Sakshi

టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో గంటా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు.

అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి, రాష్ట్రం నుంచి సాఫ్ట్‌వేర్ ఎగుమతులను పెంచే లక్ష్యంతో టి-హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హబ్ విశేషాలను మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు వివరించారు. ఆ వివరాలను ఆయన ఆసక్తిగా విని తెలుసుకున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement