చార్జ్‌ తీసుకున్న'రోబో పోలీస్‌' | Robocop takes charge in hyderabad | Sakshi
Sakshi News home page

చార్జ్‌ తీసుకున్న'రోబో పోలీస్‌'

Published Fri, Dec 29 2017 1:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

Robocop takes charge in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబ్‌ పోలీస్‌ విధుల్లో చేరనుంది. పోలీసు విభాగంలో లేటెస్ట్ సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్‌ 31 నుంచి జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్టులో విధులు నిర్వహించనుంది.

టీ-హబ్‌లో స్టార్టప్‌ కంపెనీగా ప్రారంభమైన 'హెచ్‌ బోట్స్‌' రోబోటిక్స్‌ కంపెనీ పోలీస్‌ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తుంది.అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది.

దుబాయ్‌లో వీల్స్ కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచేలా పోలీస్‌ రోబోను ‘హెచ్‌ బోట్స్‌’  రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండవ పోలీస్‌ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు.

31 నుంచి నగరంలో రోబో పోలీస్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement